ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @2900 కిలోమీట‌ర్లువిశాఖ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్రజాసంకల్ప యాత్రలో బుధ‌వారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష జనవాహిని వెంట నడువగా విశాఖ‌ జిల్లా  పెందుర్తి నియోజకవర్గంలో వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 2900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్ స‌బ్బ‌వ‌రం వ‌ద్ద 2900 కిలోమీట‌ర్ల‌కు గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటారు.2017 న‌వంబ‌ర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైయ‌స్‌ జ‌గ‌న్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టపడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారు.  
 
Back to Top