వైయస్‌ జగన్‌ వ్యక్తి కాదు..శక్తి

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తి కాదని, శక్తి అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శుక్రవారం కురుపాం నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో టీడీపీ నేతలు దోచుకో..దాచుకో విధానాన్ని అవలంభిస్తున్నారని ఎద్దేవా చేశారు.  టీడీపీ అవినీతి పాలనకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు తహతహలాడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సమన్వయకర్త బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావు, సూర్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top