వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఒంటరి పోరుప్రకాశం: వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఒంటరి పోరాటం చేస్తుందని, అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దని వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  సూచించారు. వైయస్‌ఆర్‌సీపీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరుడు గట్టిన విలన్‌లా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సరైన వ్యక్తులను బూత్‌ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలని సూచించారు. వైయస్‌ జగన్‌ చెబుతున్న నవరత్నాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలని వివరించారు. ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించి పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 
 
Back to Top