'ప్రజల పక్షాన పోరాడుతున్న ఘనత వైఎస్ జగన్ చెందుతుంది'

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసుపై ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై లేదని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. ఎన్నికల ముందు పది సంవత్సరాలకు ప్రత్యేక హోదా తెస్తానని చంద్రబాబు చెప్పారని ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గుర్తు చేశారు.

ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదాపై ఒత్తిడి తేవడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ఘటన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదని, ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29న వైఎస్ఆర్ సీపీ తలపెట్టిన ఏపీ బంద్ను విజయవంతం చేయాలని మిథున్ రెడ్డి కోరారు.
Back to Top