కుటుంబంతో సహా వైయస్ జగన్ నివాళి

ఇడుపుల పాయ)) దివంగత మహానేత
వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని పురస్కరించుకొని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ నివాళి అర్పించారు. ఇడుపుల పాయలోని వైయస్సార్ ఘాట్ దగ్గర
కుటుంబ సభ్యులతో సహా ప్రార్థనలు నిర్వహించి అంజలి ఘటించారు.

నిన్ననే ప్రతిపక్ష నేత
వైయస్ జగన్, ఆయన సతీమణి భారతి, పిల్లలు, ఆయన సోదరి వైయస్ షర్మిల, పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అక్కడకు చేరుకొన్నారు. ఉదయమే ప్రత్యేక నివాళి
కార్యక్రమానికి హాజరయ్యారు. తండ్రి తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకొంటూ వైయస్ జగన్
చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. ప్రార్థనల్లో మమేకం అయి అంజలి ఘటించారు.

వైయస్ కుటుంబసభ్యులు ఈ
కార్యక్రమానికి విచ్చేసి నివాళులు అర్పించారు. పెద్దాయనతో ఉన్న అనుబంధాన్ని
నెమరువేసుకొంటూ అంజలి అర్పించారు.

వైయస్ జగన్ తో పాటు ఎంపీలు
వైవీ సుబ్బారెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు,
పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి తదితరులు నివాళి లో
పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు తదితరులు హాజరయ్యారు.

 

తాజా ఫోటోలు

Back to Top