రామానాయుడి మృతికి వైఎస్ జగన్ నివాళి

హైదరాబాద్: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సీనియర్ నిర్మాత రామానాయుడిదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్  జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రామానాయుడి మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తెలుగు చిత్ర నిర్మాణ రంగంలోనే అగ్రగణ్యులని, మూవీ మోఘల్‌గా పేరు గడించారని చెప్పారు.  తెలుగు,తమిళ, కన్నడ,  హిందీతో పాటు వివిధ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాలను నిర్మించి ఎన్నో అవార్డులతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఘనత ఆయనకే దక్కిందని గుర్తు చేశారు. మనసున్న మనిషిగా చిత్ర పరిశ్రమలో ఆయన అందరి అభిమానాలు చూరగొన్నారని, ఎందరికో మార్గదర్శకులయ్యారని చెప్పారు. రామానాయుడు మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధకు గురిచేసిందంటూ .. తన కుటుంబ సభ్యుల పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top