జాతిపితకు వైయ‌స్‌ జగన్‌ నివాళులునెల్లూరు: జాతిపిత మహాత్మాగాంధీ 70వ వర్థంతి ఈ సందర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జగన్‌​ మోహన్‌ రెడ్డి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ సైదాపురం గ్రామంలోని బ‌స చేసే ప్రాంతం వ‌ద్ద ఏర్పాటు చేసిన గాంధీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు, సీనియ‌న్ నాయ‌కులు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి, త‌ల‌శీల ర‌ఘురాం, త‌దిత‌రులు గాంధీజీకి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
Back to Top