అబ్దుల్ కలాంకు వైయస్ జగన్ నివాళి

హైదరాబాద్ః మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. 
ఈసందర్భంగా వైయస్ జగన్ ట్విట్టర్లో కలాం మాటలను గుర్తుచేసుకున్నారు. 'మనల్ని బలంగా తయారు చేయడం కోసమే కష్టాలు వస్తాయి అని కలాం గారు చెప్పారు. తన ఆలోచనలు, చర్యలతో ఆయన దేశాన్ని బలోపేతం చేశారు. అతడి మార్గంలో నడవడమే ఉత్తమమైన శ్రద్ధాంజలి' అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.


Back to Top