రేపటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌


- మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాజ‌మండ్రి బ్రిడ్జిపై వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
 
రాజమహేంద్రవరం :  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  మంగళవారం తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని 12వ తేదీ సాయంత్రం మూడు గంటలకు రోడ్‌ కం రైలు వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండు సెంటరుకు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాజ‌మండ్రి బ్రిడ్జిపై వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌  కొన‌సాగుతుంది. అక్కడి నుంచి ధవళేశ్వరం వరకు పాదయాత్ర సాగుతుంది. జిల్లాలోకి ప్రవేశించే ముందు వంతెన మీద ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాటు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కొట్టు స‌త్య‌నారాయ‌ణ కోరారు.  వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అంద‌రూ త‌ర‌లిరావాల‌ని ఆయ‌న కోరారు.  
Back to Top