<br/><br/>కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం సాయంత్రం 5.45 గంటలకు పత్తికొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. 15వ రోజు పాదయాత్ర డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లె నుంచి ప్రారంభించి సాయంత్రానికి పత్తికొండ నియోజకవర్గానికి చేరుకున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం సర్పరాజపురం గ్రామంలోకి చేరుకున్నారు. సర్పరాజపురం గ్రామంలో పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో జననేతకు ఘన స్వాగతం పలికారు. పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ తదితరులు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. సర్పరాజపురం గ్రామంలో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి సాయంత్రం వెల్దుర్తికి చేరుకుంటారు. రాత్రి 7.30 గంటల వరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.