అన్నా..నీవే మా అండ..దండా





- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
- దారిపొడ‌వునా స‌మ‌స్య‌ల వెల్లువ‌
కృష్ణా జిల్లా :  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించాల‌ని విన‌తులు అంద‌జేస్తున్నారు. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని, రుణాలు మాఫీ చేస్తార‌ని న‌మ్మి ఓట్లు వేస్తే మోసం చేశార‌ని వాపోతున్నారు. ఆయ‌న వ‌స్తే ఉద్యోగం వ‌స్తుంద‌ని న‌మ్మి ఓట్లు వేస్తే ద‌గా చేశార‌ని నిరుద్యోగులు మండిప‌డుతున్నారు. టీడీపీ పాల‌న‌లో ర‌క్ష‌ణ క‌రువైంద‌ని మ‌హిళ‌లు, ఉద్యోగ భ‌ద్ర‌త లేద‌ని కాంట్రాక్ట్ కార్మికులు, త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం లేద‌ని ఉద్యోగులు త‌మ గోడును రాజ‌న్న‌బిడ్డ‌కు వెల్ల‌బోసుకుంటున్నారు. 
 వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 157వ రోజు పాదయాత్రను కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి జననేత ముందుకు కదిలారు.
పెయ్యేరు, డాకరం క్రాస్‌, కానుకొల్లు, పుట్ల చెరువు క్రాస్‌, లింగాల మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. 

ద‌ళితుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్ని వ‌ర్గాల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హిస్తున్నారు. కృష్ణా జిల్లాలో విశ్వ‌బ్రాహ్మ‌ణులు, నాయిబ్రాహ్మ‌ణులు, న్యాయ‌వాదుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించ‌గా ఇవాళ పెరికగూడెంలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు.  ద‌ళితుల‌తో ముఖాముఖి నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌లు తెలుకొని, వారికి ఏం చేస్తామ‌న్న‌ది ప్ర‌క‌టించ‌నున్నారు. 

ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా దారి పొడ‌వునా ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. సెంటు భూమి లేదని పేదల గోడు... పొలాలకు నీళ్లు రావడం లేదని అన్నదాత ఆవేదన...తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆక్వా రైతుల కష్టాలు... ఏళ్ల తరబడి పనిచేస్తున్నా రెగ్యులరైజ్‌ చేయడం లేదన్న కాంట్రాక్టు ఉద్యోగుల బాధ... తమకు కనీసం పింఛన్‌ కూడా ఇవ్వడం లేదన్న వికలాంగుల వేదన... ఇలా కన్నీరు పెడుతున్న పల్లె కష్టాలు చూసి జననేతను కదిలించాయి. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణుల కష్టాలు చూసి చలించిపోయారు. గ్రామీణ జీవితాన్ని కష్టాలపాలు చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. సాగు, సంక్షేమాలకు పెద్దపీట వేస్తానని... పల్లె సీమలకు కళకళలాడేలా చేస్తానని భరోసా ఇస్తున్నారు.
 

Back to Top