నీరాజ‌నం

 
 
- కృష్ణా జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అపూర్వ స్పంద‌న‌
- పోటెత్తిన విజ‌య‌వాడ న‌గ‌రం
- జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
విజ‌య‌వాడ‌:   ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు  ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టిన  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయవాడ ఆత్మీయ తివాచీతో స్వాగతం పలికింది. కనకదుర్గ వారధి వద్దే ఆయనకు అభిమాన జనసందోహం ఎదురేగి జిల్లాలోకి సాదరంగా తోడ్కొని వచ్చింది. జననేతను అనుసరిస్తూ వేలాదిమంది అభిమానులు వారధిపై కదం తొక్కారు.  కనకదుర్గ వారధిపై జనప్రవాహం ఉరకలేసింది. 1994లో నిర్మించిన ఈ 2.20 కి.మీ. పొడవైన వారధిపై ఇంతటి జనసందోహం కదలిరావడం ఇదే తొలిసారి. వైయ‌స్ జగన్‌ వెంట వేలాదిమంది ఒకేసారి అడుగులో అడుగు కదపడంతో వారధి కాసేపు ఊయలలా ఊగడం గమనార్హం.  వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విజయవాడ ప్రజలు నీరాజనం పలికారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకొని కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన జననేతకు అగుడుగునా ఘనస్వాగతం లభించింది. వేలాది మంది రాజన్న బిడ్డకు సాదర స్వాగతం పలికారు. కనక దుర్గమ్మ సాక్షిగా తొలిరోజు విజయవంతంగా సాగిన పాదయాత్ర, రెండో రోజు  ఆదివారం ఉదయం వైయ‌స్‌ఆర్‌ కాలనీ నుంచి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అక్క‌డి నుంచి అంబాపురం, జక్కంపూడి మీదుగా కొత్తూరు తాడేపల్లి చేరుకుంటారు. అనంతరం లంచ్‌ విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలసుకుంటూ ముందుకు సాగనున్నారు. కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్‌ చేరుకొని పాదయాత్ర ముగిస్తారు.  

అన్నొచ్చాడు..
వైయ‌స్ జ‌గ‌న్ కృష్ణ‌మ్మ‌ వారధి దిగగానే  కృష్ణలంక కట్ట మీద జనసందోహం అఖండ స్వాగతం పలికింది.  వేలాదిగా అభిమానులు వెన్నంటిరాగా వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నగరంలోకి ప్రవేశించారు.  జ‌న‌నేత‌ను చూడగానే ‘అదిగో అన్నొచ్చాడు’ అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. ఆయన్ని  కలిసేందుకు మహిళలు, వృద్ధులు, యువత దారిపొడువునా రోడ్లకు ఇరువైపులా నిరీక్షించారు.  పాదయాత్ర చేస్తూ నగరంలో అన్నివర్గాలవారితో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మమేకం అయ్యారు. కరచాలనం చేస్తూ, ఆత్మీయంగా పలకరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. యువత కోరికను మన్నిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. పేదలు ఆయన్ను తమ కొడుగుగా భావిస్తూ  తమ బాధలు చెప్పుకున్నారు.   

జ‌న‌నేత వెంటే.. 
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ వెంట పార్టీ నాయ‌కులు, శ్రేణులు అడుగులో అడుగు వేశారు.  పార్టీ సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్ససత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ప్రోగామ్స్‌ కో ఆర్డినేటర్‌ తలసీల రఘరామ్,  విజయవాడ,మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తలు సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ,  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్‌ అప్పారావు,  పార్టీ నియోజక వర్గాల సమన్వయకర్తలు పేర్ని వెంకట్రామయ్య(నాని), ఉప్పాళ్ల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు (కైకలూరు), కైలే అనీల్‌కుమార్‌ (పామర్రు), సింహాద్రి రమేష్‌ (అవనిగడ్డ), మొండితోక జగన్మోహనరావు(నందిగామ), జోగి రమేష్‌ (మైలరవరం), యార్లగడ్డ వెంకట్రావ్‌ (గన్నవరం), బొప్పన భవకుమార్‌ (విజయవాడ తూర్పు),  నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్,  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు, రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఆసిఫ్, సంయుక్త కార్యదర్శి అడపా శేషు,   ఎంవీఆర్‌ చౌదరి,  గౌతమ్‌రెడ్డి, కార్పొరేటర్లు బండి పుణ్యశీల, పాల ఝాన్సీ, పల్లెం రవి, చందనసురేష్, షేక్‌ బీ జాన్, కరీమున్నీసా, అవుతు శ్రీశైలజ,  డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అ«ధ్యక్షుడు డాక్టర్‌ మహబూబ్‌ షేక్,  బీసీసెల్‌ అధ్యక్షుడు కొసగాని దుర్గారావు, నగర బీసీసెల్‌ అధ్యక్షుడు బోను రాజేష్, కన్వీనర్లు ముద్రబోయిన దుర్గారావు, గొలగాని శ్రీనివాస్, బొమ్మన శ్రీనివాస్, మహేష్, పైడిపాటి రమేష్, సుబ్బు, రాజనాల శ్రీనివాస్, చిగుర వలస రాజా, డేరంగుల రమణ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర సెల్‌ అధ్యక్షుడు  నేతలు జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, మైలవరుపు దుర్గారావు, బూదాల శ్రీనివాస్, రమేష్,  తోకల శ్యామ్, మద్దిరాల ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి అవుతు శ్రీనివాసరెడ్డి,  నగర అధికార ప్రతినిధులు మనోజ్‌ కొఠారి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్యదర్శి తాళ్లూరి అశోక్,  యువజన విభాగం నేతలు తిప్పరమల్లి అశోక యాదవ్, పెద్దిరెడ్డి శివారెడ్డి, జి.జయరాజు, విజయలక్షి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి జొన్నల శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి, బెల్లంకొండ రామకృష్ణ, కె.సంజీవరెడ్డి, పి.రామరాజు, మైనార్టీ సెల్‌ నగర అధ్యక్షుడు  గౌస్‌ మొహిద్దీన్, నగర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు విశ్వనాథ్‌ రవి, వైఎస్సార్‌ సీపీ లీగ్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిళ్ల రవి, ఉగ్గు గవాస్కర్, గంజి ఉదయ్‌కిరణ్, సీనియర్‌ న్యాయవాదులు వేలూరి శ్రీనివాసరెడ్డి, చోడిశెట్టి మన్మదరావు, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు   తదితరులు పాల్గొన్నారు. 
Back to Top