కాసేపట్లో తూర్పుకు వైయస్‌ జగన్‌


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కాసేటపట్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. జననేతను కలిసేందుకు రాజమండ్రికి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. l2003లో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి జిల్లా వాసులు హారతి పట్టి స్వాగతం పలికారు. మళ్లీ ఇప్పుడు వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
Back to Top