జ‌న‌నేత కోసం ఎదురు చూపులు
 
విజయనగరం : ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. జగనన్న రాకకోసంఎదురు చూస్తున్న జిల్లా కేడర్‌లో ఉత్సాహం రెట్టింపవుతోంది.ఆయన రాకకోసం జిల్లా పార్టీ విస్తృత  ఏర్పాట్లు చేస్తోంది. బడుగువర్గాల అభ్యున్నతికోసం... నిరుపేదల సంక్షేమం కోసం...  తాను అధికారంలోకి వస్తే ఏమేం చేయాలో తెలుసుకునేందుకు జననేత వైయ‌స్ జగన్‌మోహన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 16వ తేదీ విజ‌య‌న‌గ‌రం జిల్లాకు రానుంది. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి... తిరిగి శ్రీకాకుళంవెళ్లేంతవరకూ సంబరంగా యాత్ర సాగేలా శ్రేణులను నాయకత్వం సమాయత్తం చేస్తోంది. తొమ్మిది నియోజకవర్గాల మీదుగా యాత్రసాగించేందుకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే పార్టీ పెద్దలు రూపొందించారు. 

ప్రజల కోసం... వారి బతుకుల్లో వెలుగులు నింపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా.. కొనసాగించేందుకు ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16న విజయనగరం జిల్లాలో అడుగు పెట్టనున్నారు. ఎస్‌ కోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతలపాలెంలో ప్రవేశించి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల మీదుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లేలా ఆ పార్టీ నేతలు రూట్‌మ్యాప్‌ తయారు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు జిల్లాకు జననేత వస్తారా.. ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ ఆయన మార్గంలో పాదం కలపాలని జిల్లా నేతలు కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్ష తీరేరోజు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ప్రతిఒక్కరిలోనూ నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.


యాత్ర కోసం భారీ ఏర్పాట్లు
వైయ‌స్ జగన్‌ పాదయాత్ర అంటే ఆషామాషీ కాదు. అన్న వస్తున్నాడంటే ఆయనను చూడాలని, ఒక్కసారి కరచాలనం చేయాలని పార్టీలకు అతీతంగా ప్రజలు ఎగబడతారు. ఏ పార్టీ నేతలైనా ఆయన ప్రజా సంకల్పయాత్రను వీక్షిస్తే నిశ్ఛేష్టులై నిలబడిపోతారు. అంతలా ప్రజల ప్రేమను గెలుచుకున్నారు గనుగనే ఆయన జననేత అయ్యారు. అలాంటి నేత మన జిల్లాకు వస్తున్నారనీ... దాదాపు నెల రోజులు జిల్లాలోనే ఉంటారని తెలియగానే ఇక్కడి నేతల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయడం కూడా ప్రతిఒక్కరి బాధ్యతగా భావిస్తూ భారీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రణాళికలు రచించుకుంటున్నారు. మరో వైపు మన జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చారిత్రక ఘట్టాలను ఆవిష్కరించనుంది.  

నేనున్నానంటూ భరోసా

నాలుగేళ్ల క్రితం జనం ఒకరిని నమ్మి... అనుభవజ్ఞుడని, హామీలు నెరవేరుస్తాడని ఓట్లు వేశారు. రుణమాఫీ అంటూ, ఇంటింటికీ ఉద్యోగం అంటూ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ఆ పెద్దమనిషి ప్రజా సమస్యలను పట్టించుకోవడమే మానేశారు. ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే. అమాయకులు, సామాన్యులు అడుగడుగునా అన్యాయానికి గురవుతుంటే వారి కష్టాలను, కన్నీళ్లను చూసి చలించిపోయిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ, ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ ప్రజా సంకల్పయాత్ర సాగిస్తున్నారు. ఇప్పటికే 10 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని 11వ జిల్లాగా విశాఖపట్నంలో అలుపెరుగని బాటసారిగా ముం దుకు సాగుతున్నారు. 12వ జిల్లాగా మన జిల్లాలో అతి త్వరలో అడుగు పెట్టబోతున్నారు.
 
పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేద్దాం
ఈ నెల 16వ తేదీ నుంచి జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం కావ‌డంతో పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌కాల‌ని తీర్మానించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను రాజ‌న్న బిడ్డ‌కు వివ‌రిద్దామ‌ని, జిల్లాలో పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసి, న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌తి ఇంటికీ చేరువ‌చేద్దామ‌ని సూచించారు. 
Back to Top