నిర్వీరామంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర– మధ్యాహ్న భోజన విరామం లేకుండా సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర
– ఉండ్రాజవరంలో ఐదు గంటల పాటు పాదయాత్ర
– పోటెత్తుతున్న పల్లెలు
– రాజన్న బిడ్డకు అడుగడుగునా బ్రహ్మరథం

పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్వీరామంగా కొనసాగుతోంది. భోజన విరామం లేకుండా కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర. దారి పొడవునా చిరు జల్లులు కురుస్తున్నా వైయస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జన ప్రభంజనంతో నిదానంగా సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర. స్థానికులు భారీగా తరలివచ్చి జననేతకు తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఒక్కో గ్రామం దాటేందుకు గంటల కొద్ది సమయం పడుతోంది. ఓపికగా సమస్యలు వింటూ ..వినతులు స్వీకరిస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. 


జననేత వైయస్‌ జగన్‌ రాకతో నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం గ్రామం జనంతో పోటెత్తింది. ఈ ఒక్క గ్రామంలోనే ఐదు గంటల పాటు వైయస్‌ జగన్‌ పాదయాత్ర సాగింది. పాలంగిలో గంటకు పైగా కొనసాగిన ప్రజా సంకల్ప యాత్ర. మోర్తాలో భారీ జన సందోహం మధ్య గంటన్నర పాటు పాదయాత్ర సాగింది. అడుగడుగునా జన నీరాజనాల మధ్య వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది.  అడుగడుగునా జనం సమస్యలు తెలుసుకుంటూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. ఉండ్రాజవరంలో వైయస్‌ జగన్‌ ఆటో నడిపారు. అలాగే చిన్నారికి అక్షరాభ్యాసం చేయించారు.
 
Back to Top