బురద రోడ్లపై నుంచే వైయస్‌ జగన్‌ పాదయాత్ర


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వర్షం లోనే కొనసాగుతోంది. వరుస రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. ఈ రోడ్లపైనే వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వైయస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించి నేటికి నెల రోజులు అవుతోంది. వైయస్‌ జగన్‌ రాకతో తూర్పు గోదావరి జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం ఊలపల్లికి చేరుకున్న జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ను చూసేందుకు గ్రామం మొత్తం కదిలివచ్చింది. ఊలపల్లి ప్రజలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే పేదలకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఉందని ఊలపల్లి ప్రజలు పేర్కొంటున్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని స్థానికులు నినదించారు. 
 
Back to Top