800 కిలోమీటర్లు దాటిన జ‌న జ‌గ‌న్ పాద‌యాత్ర‌

 
 

చిత్తూరు:  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా  గంగాధ‌ర నెల్లూరు నియోజకవర్గం క‌ళ్ల‌వెంగ‌న‌ప‌ల్లి వద్ద  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సంద‌ర్భంగా గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ మొక్క‌ను నాటి, పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  ప్ర‌తి వంద కిలోమీట‌ర్ల‌కు ఒక మొక్క‌ను నాటుతూ వైయ‌స్ జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నారు.  క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి, డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో 200 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిన 21వ రోజు పాదయాత్రలో భాగంగా జననేత జగన్ 300 కిలోమీట‌ర్ల మైలు రాయిని కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్నారు. 29 రోజు పాదయాత్రలో భాగంగా అనంత‌పురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు, డిసెంబ‌ర్ 24న అనంత‌పురం జిల్లా ఉట్లూరు వ‌ద్ద 600 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు. చిత్తూరు  జిల్లా జ‌మ్మివారిప‌ల్లెలో 700 కిలోమీట‌ర్లు పూర్తి చేశారు. ఇవాళ అదే జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని నల్లవెంగనపల్లిలో 800 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు. అడుగ‌డుగునా జ‌న‌నేత‌కు ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. ఏ నోట విన్నా వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆకాంక్షిస్తున్నారు. దారిపొడువునా స‌మ‌స్య‌లు చెప్పుకొని స్వాంత‌న పొందుతున్నారు. మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని, న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌తి ఒక్క‌రి ముఖాల్లో చిరున‌వ్వులు చూడ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సాగుతున్న గ్రామాల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు.  ప్రజాసంకల్పయాత్రలో తాము సైతం అంటూ ఓ ఎన్నారై జంట పాల్గొంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో  బుధవారం జగన్‌తో కలిసి ఎన్నారై దంపతులు అడుగులు కలిపారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లెకు చెందిన హరిప్రసాద్‌, సరిత దంపతులు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని తమ అభిమానం చాటుకున్నారు. 

Back to Top