పోటెత్తిన పాదయాత్ర


- దారిపొడువునా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం
- ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. రాజన్న బిడ్డకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పల్లె పల్లె కదలి వచ్చి జననేతకు హరతి పడుతున్నారు. పాదయాత్ర దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని కుక్కలవారి కండ్రిగ గ్రామం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం క్రాస్, కుమ్మర మిట్ట, మోదుగు పాలేం క్రాస్, కొత్త వీరాపురం, అగ్రహారం, కంబాక, అంజిమీడు క్రాస్ కు చేరుకున్నారు. దారిపొడవునా ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. కొత్త వీరాపురం గ్రామం వ‌ద్ద మ‌హిళ‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఏం చేస్తామ‌న్న‌ది వివ‌రించారు. కంబాక వ‌ద్ద రైతులు జ‌న‌నేత‌ను క‌లిసి తాము ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను చెప్పారు. చంద్ర‌బాబు-క‌రువు క‌వ‌ల‌ల‌ని ఆయ‌న ఎప్పుడు సీఎం అయినా చ‌క్కెర‌, పాల ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డుతున్నాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. మ‌న్న‌వ‌రం ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని స్థానికులు కోరారు. అలాగే దారి మ‌ధ్య‌లో మ‌త్స్య‌కారులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ వ‌ల వేసి మ‌త్స్య‌కారుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ పాద‌యాత్ర మేర్లపాక క్రాస్‌ మీదుగా చిందేపల్లి వరకు కొనసాగింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ జ‌గ‌న్ 896.4 కిలోమీట‌ర్లు న‌డిచారు. రాత్రికి చిందేపల్లిలో వైయ‌స్‌ జగన్‌ బస ప్రాంతానికి వెళ్లారు.

Back to Top