ఎటు చూసినా జ‌న‌మే జ‌నం


- పోటెత్తుతున్న పాద‌యాత్ర దారులు
- విశాఖ జిల్లాలో దిగ్విజ‌యంగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- సాయంత్రం య‌ల‌మంచలిలో భారీ బ‌హిరంగ స‌భ‌
విశాఖ‌: అధికార పార్టీ ఆగడాలతో అల్లాడిపోతున్న ప్రజలకు సాంత్వన చేకూర్చేందుకు ఆత్మీయుడిలా వ‌చ్చిన జ‌న‌నేత వైయ‌స్ గన్‌మోహన్‌రెడ్డికి విశాఖ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రాజ‌న్న బిడ్డ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. దారుల‌న్నీ పోటెత్తుతున్నాయ. అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 244వ రోజు శుక్రవారం యలమంచలి నియోజకవర్గంలో కొన‌సాగుతోంది.  జిల్లాలోని ఎనిమిదో రోజు పాదయాత్ర యలమంచిలి రూర ల్‌ మండలంతోపాటు యలమంచిలి పట్టణ పరిధిలో సాగుతుంది. రేగుపాలెం జంక్షన్‌ నుంచి ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కాగా అక్క‌డి నుంచి పాదయాత్ర మల్లవరం, లైన్‌ కొత్తూరు, రామకృష్ణాపురం,  సోమన్నపాలెం, గాంధీనగ ర్‌ మీదుగా యలమంచిలి పట్టణంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎ దురుగా మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభలో వైయ‌స్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. అనంతరం యలమంచిలి పట్టణ పురవీధుల మీదుగా కొత్తపాలెం క్రాస్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారన్నారు.  


దారుల‌న్నీ పాద‌యాత్ర వైపే
ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దారుల‌న్నీ జ‌నంతో కిక్కిరిసిపోతున్నాయి. ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు.  పిల్లాపాపలతో ఎదురేగిస్వాగతం ప‌లుకుతున్నారు. ప్ర‌జ‌ల‌తో  మమేకమ‌వుతూ..వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు.  యువ‌త జ‌న‌నేత‌కు జేజేలు పలికాయి. జగన్నినాదాలతో హోరెత్తించారు. పల్లెకదిలొచ్చిందా అన్నట్టుగా గ్రామాలు పసిపాపల నుంచి పండు ముదుసలి వరకు అన్ని వర్గాల వారు బారులుతీరి మరీ జననేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు.
Back to Top