- దిగ్విజయంగా కొనసాగుతున్న వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర- ప్రజలతో మమేకమవుతూ..వారి సమస్యలు వింటున్న జననేత  కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 6వ తేదీ వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటికి 21 రోజులు కావోస్తుంది. వైయస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు ఎదురెళ్లి ఘన స్వాగతం పలుకుతున్నారు. బుధవారం సాయంత్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 100 మైలు రాయి, డోన్ నియోజకవర్గం ముద్దనూరు గ్రామంలో 200 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన వైయస్ జగన్ 300 కిలోమీటర్ల మైలు రాయిని కూడా ఇదే జిల్లాలో పూర్తి చేశారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బి.అగ్రహారం- కారుమంచి గ్రామాల మధ్యలో వైయస్ జగన్ 300 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాజన్న బిడ్డ 300 కిలోమీటర్ల మార్కు వద్ద మొక్కను నాటారు.
ఏ దారి చూసినా జనమే జనం..వైయస్ జగన్ మోహన్ రెడ్డి తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు పనులు మానుకొని, ఎదురెళ్లి ఘన స్వాగతం పలుకుతున్నారు. పూలవర్షం కురిపించి, హారతులు పట్టి అభిమానం చాటుకుంటున్నారు. ఏ ఊరికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. చిన్న గ్రామాల మీదుగా యాత్ర సాగినా ప్రజలు వేలాదిగా తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. గ్రామాల్లో ఏ మిద్దె చూసినా, ఏ వీధి చూసినా, ఏ రహదారి చూసినా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. రాజన్న బిడ్డతో కరచాలనం చేసేందుకు యువత పోటీపడుతున్నారు. మహిళలు, వృద్దులు జననేతను ఆప్యాయంగా పలకరించి తమ బాధలు చెప్పుకుంటున్నారు. చివరకు భద్రతా సిబ్బందిని సైతం నెట్టేసి జననేతతో కరచాలనం చేసేందుకు దూసుకురావడంతో వారిని ఆపడం ఎవరితరం కావడం లేదు. వైయస్ జగన్ కల్పించుకుని అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగడంతోపాటు కరచాలనం చేసి వారికి అప్యాయతను పంచుతున్నారు.. అక్కాచెల్లెళ్లు ఎక్కడికక్కడ వైయస్ జగన్‌కు హారతులిచ్చి, రాఖీలు కట్టి స్వాగతం పలుకుతున్నారు. కూలీలు, రైతులు పనులు మానుకుని వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, అన్నదాతలు, అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తాము పడుతున్న కష్టాలను వైయస్ జగన్‌కు చెప్పుకుంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అలుపు, సొలుపు లేకుండా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు.