వైయస్‌ జగన్‌ మన ఆశా జ్యోతి

గుంటూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మన రాష్ట్రానికి ఆశా జ్యోతి అని డాక్టర్‌ రావు అన్నారు. యువభేరిలో ఆయన మాట్లాడారు.  వాస్తవానికి ఈ రాష్ట్రం పారిశ్రామికంగా, వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందాలి. ఎక్కువ మంది గ్రామీణులు ఉన్నారు. వాళ్లకు సరిౖయెన ఉద్యోగాలు, ఉపాధి లేదు. వ్యవసాయ రంగానికి నీటి సౌకర్యం లేదు. తెలుగు ప్రాంతాల ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి హైదరాబాద్‌లో రాజధాని నిర్మించుకుంటే ఇప్పుడు రాజధాని లేదు. కొత్త రాజధాని నిర్మించుకోవాలి. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. పటేల్‌ ఉద్యమం, కాపు ఉద్యమం జరుగుతోంది. రుణమాఫీ అని మోసపూరిత వాగ్ధానం చేసి ఉంటే వైయస్‌ జగన్‌ కూడా ముఖ్యమంత్రి అయ్యేవారు. మాట మీద నిలబడ్డ నేత ఆయన ఒక్కరే. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే టికెట్లు ఇచ్చి సమన్యాయం పాటించారు. కందుకూరులో ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆయన్ను చూడటానికి వచ్చారు. వారందరూ కూడా కటిక పేద వారు. వాళ్లందరి కోసం హెలిప్యాడ్‌ నుంచి టాప్‌లెస్‌ జీవుపై వేదిక వద్దకు వచ్చారు. అది ఆయన సిప్లిసిటి. ఆయన ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు. ఈ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్‌ జగన్‌. అలాంటి నాయకుడ్ని ఈ రాష్ట్రం పొందడం అదృష్టం. ప్రజల పక్షాన నిలబడ్డ నేత ఆయనే. ప్రత్యేక హోదా సాధన వైయస్‌ జగన్‌తోనే సాధ్యం. ప్రజా నాయకుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.

Back to Top