వైయస్‌ జగనే భవిష్యత్తుకు భరోసా

పామ్రరు(కె.గంగవరం):  దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల అమలుకు దీక్షాబద్దుడైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా అని పార్టీ మహిళా విభాగం జిల్లా అ«ధ్యక్షురాలు యనమదల గీత అన్నారు. మండలంలోని పామ్రరులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పాకలు అగ్నికి ఆహుతై రెండు కుటుంబాలు నిరాశ్రయులైయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యనమదల గీత, పార్టీ జిల్లా వైద్య విభాగ కన్వీనర్‌ మురళికృష్ణ బాధిత కుటుంబాలు బద్దా బాలసురేంద్రకుమార్, మద్దా కావమ్మలను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా గీతా మాట్లాడుతూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే పేదల బతుకులకు బరోసా లభిస్తుందన్నారు. గుడిసెæ లేని రాష్ట్రం తనకు స్వప్నంగా చెప్పిన చెప్పిన వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలో ఐదేళ్ల కాలంలో 40 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందించారని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాది కాలంలో ఒక్క ఇళ్లు కూడా నిర్మించడలేదని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పేదలందరికీ సొంత గూడు ఏర్పాడుతుందన్నారు.   

Back to Top