ప్రధానమంత్రికి వైయస్ జగన్ బహిరంగ లేఖ

హైదరాబాద్)) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. నల్లధనం వెల్లడికి సంబంధించి అంతా గోప్యం అని నిబంధనలు చెబుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని వివరాలు తెలిసాయంటూ లీకులు ఇస్తున్నారని ..వీటి సంగతి తేల్చాలని నిలదీశారు. అంటే ఆ వెల్లడి చేసిన వ్యక్తి చంద్రబాబుకి బినామీ అయిఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ఒక్కరూ తనపై విచారణ జరిపించలేరన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారని, ఓటుకి కోట్లు కేసు విషయంలో అదే జరిగిందని వైయస్ జగన్ ఉదహరించారు. అందుచేత ఆదాయాన్ని వెల్లడించిన వారి పేర్లను వెల్లడించాలని, చంద్రబాబు మీద విచారణ జరిపించాలని వైయస్ జగన్ నేరుగా ప్రధానమంత్రిని కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top