నేత్రదాన శిబిరం ప్రారంభం


చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో కొనసాగుతోంది. కొది సేపటి క్రితం ఏర్పేడులో వైయస్‌ఆర్‌సీపీ యువనేత కే. మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరాన్ని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నేత్రదానం చేసేందుకు ఈ సందర్భంగా 200 మందికి పైగా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బియ్యం మధుసూదన్‌రెడ్డి, సీనియన్‌ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top