చాలెంజ్‌..ఛాలెంజ్‌.. చాలెంజ్..!

అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబుకు స‌వాల్
ప్ర‌క‌ట‌న‌ల‌తో క‌న్ ఫ్యూజ‌న్‌
అడ్డ‌గోలుగా ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్: అసెంబ్లీ వేదిక‌గా తెలుగుదేశం పార్టీ అడ్డ‌గోలుగా ప్ర‌వ‌ర్తించ‌బోయి బోర్లాప‌డింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల అబ‌ద్దాలు అంద‌రి ముందు వెల్ల‌డ‌య్యాయి. అస‌త్య‌పు ఆరోప‌ణ‌ల మీద ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్రశ్నించేస‌రికి తోక ముడిచారు. 

ప్ర‌క‌ట‌న‌తో నాటకం
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ వేదిక‌గా నాటకాన్ని న‌డిపించారు. ప్ర‌త్యేక హోదా తీర్మానం మీద చ‌ర్చ సంద‌ర్భంగా ఒక ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న నోట్ ను అసెంబ్లీల పంచిన‌ప్ప‌టికీ, అందులో అంశాల‌కు సంబందం లేకుండా ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం సాగుతున్న‌తీరుపై విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. నోట్ లోని అంశాల‌కు, చేస్తున్న ప్ర‌క‌ట‌న‌కు సంబంధం లేద‌ని అన్నారు. ఇది త‌ప్ప‌ని రుజువు చేస్తే తాను రాజీనామాకు సిద్ద‌మ‌ని, ఇందుకు చంద్ర‌బాబు సిద్ద‌మా అని ప్ర‌శ్నించారు. దీనికి అధికార ప‌క్షంనుంచి స‌మాధానం రాలేదు.

అడ్డ‌గోలు ఆరోప‌ణ‌లు
ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతుంటే అడ్డు త‌గిలిన మంత్రి అచ్చెన్నాయుడు. అస‌త్య‌పు ఆరోప‌ణ‌ల‌కు దిగారు. వైఎస్ జ‌గ‌న్‌, టీఆర్ ఎస్ నాయ‌కుల‌తో హైద‌రాబాద్‌లోని ఒక హోట‌ల్ లో క‌లిశారంటూ క‌థ‌లు చెప్ప‌సాగారు. దీన్ని ఖండించిన వైఎస్ జ‌గ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు. టీఆర్ఎస్ మంత్రుల‌తో క‌లిసిన‌ట్లుగా రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. లేనిప‌క్షంలో చంద్ర‌బాబు రాజీనామా చేస్తారా అని సూటిగా ప్ర‌శ్నించారు. దీనికి కూడా అదికార ప‌క్షం నుంచి సమాధానం క‌ర‌వు అయింది.

స‌వాల్ కు సమాధానం క‌ర‌వాయె...!
ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ దాని మీద స‌మాధానం లేదు. ప్ర‌తీ దానికి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసి ప‌బ్బం గ‌డుపుకొనేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అసెంబ్లీ బ‌హిరంగంగా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ స‌వాలు విసిరిన‌ప్ప‌టికీ ఎటువంటి జ‌వాబు రాలేదు. దీన్ని బ‌ట్టి తెలుగుదేశం నాయ‌కులు ఎంత అడ్డ‌గోలుగా మాట్లాడుతున్న‌దీ అర్థం అయింది. 
Back to Top