విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు వైయస్ జగన్

తిరుపతి: విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అని, అందుకే ఎన్నికల సమయంలో అబద్ధాల హామీలను ఇవ్వలేదని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడిలా అబద్ధాల హామీలు ఇచ్చుంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాల సాధన కోసం వైయస్‌ జగన్‌ నిరంతరం కృషి చేస్తున్నారని భూమన చెప్పారు. వైఎస్‌ఆర్‌ మరణవార్తను విని 700 మంది చనిపోయారని పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని అప్పట్లో వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరస్కరించారని తెలిపారు. అయినా వైయస్‌ జగన్‌ ధైర్యంగా బాధిత కుటుంబాలను ఓదార్చారని, ఇది ఆయనకున్న నిబద్ధత అని భూమన అన్నారు.Back to Top