వైయస్‌ జగన్‌ మన ఆశాజ్యోతి

గుంటూరు:  మన ఆశా జ్యోతి వైయస్‌ జగన్‌మోహనరెడ్డి అని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ అన్నారు. పొన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనేక సమస్యలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని, మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 13 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క మంచి పని చేయలేదన్నారు. ఐదు కోట్ల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను తన స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహానేత ఆశయ సాధనకు వైయస్‌ జగన్‌ ముందుకు వచ్చారన్నారు.  వైయస్‌జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఒకే కుటుంబం నుంచి 30 ఏళ్లుగా ఎన్నికవుతున్నా..ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రజలను భయపెట్టి, దౌర్జన్యంతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. భరితెగించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. దుళిపాళ్ల నరేంద్ర చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించడం లేదన్నారు. మనమంతా కలిసి వైయస్‌ జగన్‌కు తోడుగా ఉండి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Back to Top