వైయస్‌ జగన్‌ను కలిసిన రజకులు



గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో రజకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు జననేతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ..రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాలపై సాధ్యాసధ్యాలను పరిశీలించి రాజ్యంగ నిపుణులతో కమిటీ వేయాలన్నారు. 45 సంవత్సరాలు నిండిన రజక వృత్తిదారులకు రూ.2500 పింఛన్‌ నేతన్నలు, గీతన్నల మాదిరిగా ఇవ్వాలని కోరారు. రజకులపై రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు.  మండలస్థాయిలో రజక పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. సాంప్రదాయ రజక వృత్తిని యంత్రీకరించి ఆధునీకరించాలన్నారు. అన్యాక్రాంతమవుతున్న రజక వృత్తి చెరువులను, దోభీఘాట్లను పరిరక్షించాలని కోరారు.  ప్రభుత్వ రంగ సంస్థలు, దేవాయాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దోభీ పోస్టులను రజకులకు మాత్రమే కేటాయించాలని వినతిపత్రంలో కోరారు. వీరి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే రజకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top