రైతుల‌ను ఆదుకునే ప్ర‌భుత్వం వ‌స్తుంది



– భరోసా కల్పించిన జననేత 
పశ్చిమ గోదావరి జిల్లా: రైతుల‌ను ఆదుకునే ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, నష్టపోయేది మేమేనని, చేసేది మేమేనని వారు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 168వ రోజు ప్రజా సంకల్ప యత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను కౌలు రైతులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కౌలు రైతులు విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా మహిళా రైతు ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని పేర్కొంది.  ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి అవుతుందని, 40 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారు. కౌలు 15 బస్తాలు చెల్లించాల్సి వస్తుందని, నష్టపోతుంది కౌలు రైతే అని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మీకు గిట్టుబాటు ధర కావాలి అంతే కదా? కౌలు రైతుకు మేలు జరగాలంటే ప్రయోజనాలు డైరెక్టుగా అందాలన్నారు. గిట్టుబాటు ధర రూ.1550 అయితే మనకు వెయ్యి కూడా రావడం లేదన్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు..మద్దతు ధర కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకులోళ్లు డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులకు కౌలు కార్డులు లేవు..బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
Back to Top