బాబు సర్కార్‌ వివక్ష చూపుతోంది

పశ్చిమ గోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం తమపై వివక్ష చూపుతుందని దివ్యాంగులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 167వ రోజు  వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని దివ్యాంగులు కలిశారు. సోమవారం పెదతాడేపల్లి వద్ద  వికలాంగులు సుబ్బారావు, రాఘవేంద్ర తదితరులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ ఏమాత్రం సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వికలాంగులకు ప్రత్యేక రుణాలు ఇచ్చేవారని, ఇప్పటి పాలకులు తమపై వివక్షచూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌..తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. 
 
Back to Top