నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారందరికీ 2017 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివెరియాలని ఆయన ఆకాంక్షించారు.

క్యాలెండర్ల మార్పుతో పాటు కొత్త ఏడాదిలో తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో , దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని వైయస్‌ జగన్‌ కోరారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.


Back to Top