జనం మధ్యనే జననేత నూతన సంవత్సర వేడుకలు

చిత్తూరు : ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల సమక్షంలోనే 
నూతన సంవత్సరపు తొలి రోజును జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా ముదివేడులో ఆయన పార్టీ నాయకులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేయగా. టిటిడి అర్చకుల సమక్షంలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రతిపక్ష నేతకు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. 
ప్రత్యేక పూజలు, అభిమానుల మధ్య నూతన సంవత్సర వేడుకల అనంతరం ప్రజా సంకల్పయాత్ర 49 వ రోజు కార్యక్రమం ప్రారంభమైంది.  నేటి పాదయాత్ర కడప క్రాస్‌రోడ్డు‌, నడింపల్లి, ఆర్‌సీ కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింతవారిపల్లి, చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి, సీటీఎం క్రాస్‌ రోడ్స్ మీదగా సీటీఎం వరకు కొనసాగనుంది.

Back to Top