నెల్లూరుకు వైయస్ జగన్

నెల్లూరుః  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల రాజారెడ్డి (55) భౌతికకాయానికి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సన్నిహితుడు రాజారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైయస్ జగన్ సూళ్లురుపేటకు చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు రాజారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడుగా ఉన్న దబ్బల రాజారెడ్డి (55) శుక్రవారం అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 

అంతకుముందు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా  రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వైయస్ జగన్ కు చిత్తూరు జిల్లా వైయస్సార్సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో పాటు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైయస్ జగన్ అక్కడి నుంచి సూళ్లూరుపేటకు బయలుదేరి రాజారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top