నరసరావుపేటకు వైయస్ జగన్

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు. అక్కడ ఆయన ప్రజలతో మమేకమవడమే కాకుండా పార్టీ కార్యకర్తలను కలుస్తారు. ఈ సందర్భంగా  వైయస్‌ జగన్‌ సమక్షంలో కాసు మహేష్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరనున్నారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Back to Top