వైయస్‌ జగన్‌ నంద్యాల తొలిరోజు షెడ్యుల్‌

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వేగవంతం చేసింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ను  పార్టీ కేంద్ర కార్యాలయం విడుదలల చేసింది. ఎన్నికల ప్రచారం  9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట కు  రైతునగరం నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.  మొదటి రోజున ప్రచారం, రామకృష్ణానగర్, కానాల, హెచ్‌ఎస్‌ కోట్ల, బాబానగర్, ఎం.చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, శ్రీరాంనగర్, తేల్లపురి, రాయపాడు మీదుగా ఎస్‌.కల్లూరు  వరకు జరుగుతుంది.

వైయస్ జగన్ ప్రచారానికి రానుండడంతో పార్టీశ్రేణుల్లో నూతనోత్సాహనం నెలకొంది. వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు వైయస్సార్సీపీకి అండగా నిలిచేందుకు నంద్యాల ప్రజలు సిద్ధమయ్యారు. మోసపూరిత హామీలతో వంచించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని ప్రజలు అంటున్నారు. వైయస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యమని, శిల్పాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 
Back to Top