వైయస్‌ జగన్‌ ఇమేజ్‌ నాకు కొండంత బలం శిల్పా మోహన్‌ రెడ్డి

నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇమేజ్‌ తనకు కొండంత బలమని నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా తనను నంద్యాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో భూమా నాగిరెడ్డి కూడా వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోటోలతో గెలిచారని గుర్తు చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నంద్యాల ఉప ఎన్నికలో తనకు తోడుగా నిలబడతారని తెలిపారు. ఈ నెల 3న నంద్యాలలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరవుతున్నారని, నియోజకవర్గంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై  మద్దతు ప్రకటించాలని మోహన్‌ రెడ్డి కోరారు.

Back to Top