ధైర్యం చెబుతూ..భ‌రోసా ఇస్తూ..


- విజ‌య‌వంతంగా సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- దారిపొడ‌వునా స‌మ‌స్య‌లు వింటున్న వైయ‌స్ జ‌గ‌న్‌
- ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో విజ‌య‌వంతంగా సాగుతోంది. మంగ‌ళ‌వారం ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలోని వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర అడుగుపెట్టింది. జ‌న‌నేత‌కు అడుగుడుగునా జన నీరాజనాలు అందుతున్నాయి. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో అన్యాయానికి గురైన వారి బాధ‌లు వింటూ, ఆవేదనతో రగులుతున్న ఆప్తులకు ‘నేనున్నానని, మీకేం కాదని’ వైయ‌స్‌ జగన్‌ ధైర్యం చెబుతుంటే.. ‘మీ సంకల్పం నెరవేరాలి.. రాజన్న రాజ్యం రావాలంటూ’ జనం ఆకాంక్షిస్తూ.. ఆశీర్వదిస్తున్నారు. ఉద‌యం దువ్వూరు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. అనంత‌రం న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని జననేత వైయ‌స్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. నాలుగు విడ‌త‌ల్లో పొదుపు రుణాలు మాఫీ చేసి ఆ డ‌బ్బులు మీ చేతుల్లోనే పెడ‌తాన‌ని మ‌హిళ‌ల‌కు మాట ఇచ్చారు. వ‌డ్డీ లేని రుణాలు అందిస్తామ‌ని, అర్హులంద‌రికీ ప‌క్కా గృహాలు నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.  ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తామ‌ని చెప్పారు . వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయిస్తాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. దేశంలో ఎక్కడైనా సరే చికిత్స పొందేలా వీలు కల్పిస్తామ‌ని వివ‌రించారు. పేద రోగికి శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి పొందే రోజుల్లో డబ్బులిస్తామ‌ని చెప్పారు. తలసీమియా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం’ అని భరోసా ఇచ్చారు.  వైయ‌స్ జ‌గ‌న్ హామీతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top