హోదా కోసం పోరాడుతూనే ఉంటాంఅమరావతి: ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు నిస్వార్థంగా పోరాడారని ట్వీటర్‌ వేదికగా వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఇతరులు చేసిన డ్రామాలు, మోసపూరిత దీక్షల్లా కాకుండా తమ పార్టీ చిత్తశుద్ధితో హోదా పోరు కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.
‘‘ప్రత్యేక హోదా కోసం మా ఐదుగురు ఎంపీలు నిస్వార్థంగా పదవులను త్యజించారు. బలవంతంగా ఆస్పత్రికి తరలించేవరకూ నిరాహార దీక్ష కొనసాగించారు. వారిని కలవడం గర్వంగా ఉంది. మా ఎంపీల ప్రయత్నం చాలా స్ఫూర్తిమంతమైనది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌ సీపీ పోరును కొనసాగిస్తూనే ఉంటుంది. జిమ్మిక్కులు, డ్రామాలు, ప్రజలను మభ్యపెట్టడానికి దీక్షలు చేసేవారిలా కాకుండా మా పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుంది’’ అని వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top