అంబేద్కర్ ఆశ‌యాలు స్ఫూర్తిదాయ‌కం

 విజయవాడ : భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్ ఆశ‌యాలు మనందరికీ స్ఫూర్తిదాయమని వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  అన్నారు. అంబేద్క‌ర్ జయంతి సందర్భంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌స చేసే ప్రాంతంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా దళితులు, మహిళలు, కార్మికుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి అంబేద్కర్‌ అని వైయ‌స్ జ‌గ‌న్ కొనియాడారు. జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  అంబేద్కర్‌ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా పాటించాలని వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయించింది. సేవ్‌ డెమొక్రసీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్‌ విగ్రహాల వద్ద పార్టీ శ్రేణులు నిరసనలు తెలుపనున్నాయి.

తాజా వీడియోలు

Back to Top