అంబేడ్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న చిత్ర‌ప‌టానికి నివాళులర్పించారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా బుధ‌వారం అనంత‌పురం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందుగా అంబేడ్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం అంబేద్క‌ర్ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. సమానత్వం పునాదులపై నిర్మితమైన భారత రాజ్యాంగం అన్ని వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలిచిందని వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. 
Back to Top