ప్రేమంటే ఎలా ఉంటుందో చూపిస్తా



– నాన్నగారి స్ఫూర్తితో మరో రెండు అడుగులు ముందుకు వేస్తా
– మీ పిల్లలను నేను చదివిస్తా
– ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టిస్తా
– 72 గంటల్లో మీ గ్రామంలోనే మీకు కావాల్సిన పథకాలు ఇప్పిస్తా
– చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతి
– బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మూడు సార్లు తీర్మానం చేశారు
– కాపులను కూడా చంద్రబాబు మోసం చేశాడు
– నాలుగేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టారా
– రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ రావాలి
– హంద్రీనీవాను తీసుకొచ్చానని బాబు మాట్లాడటం ఆశ్చర్యం
– బాబూ..నీలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? 

అనంతపురం: ప్రేమంటే ఏంటో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చూపించారని, నాన్నగారి స్ఫూర్తితో మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్నానని, ప్రేమంటే ఏంటో చూపిస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దొంగల రాజ్యం సాగుతోందని, అబద్ధాలు, మోసాలు చెప్పే నాయకుడు మనకు కావాలా అని ప్రశ్నించాడు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, ఇదివరకే ప్రకటించిన నవరత్నాలను మెరుగ్గా అమలు చేసేందుకు, ప్రజల కష్టాలు తెలుసుకుని, వారికి తోడుగా నిలిచేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినట్లు చెప్పారు. పాదయాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. ఆయన ఏమన్నారో..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– వైయస్‌ఆర్‌ జిల్లా, కర్నూలు జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసి ఈ రోజు అనంతపురం జిల్లాలో అడుగుపెట్టాను. వేలమంది ఈ రోజు నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. చాలా మంది అన్నా..మేమంతా నీకు తోడుగా ఉంటామని నాతో పాటు  ఇక్కడికి వచ్చారు.
– ఇవాళ ఇక్కడ నిల్చుండాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. వేలాది మంది నడిరోడ్డు అన్న సంగతి కూడా ఖతరు చేయడం లేదు. చెరగని చిరునవ్వుతో ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచిపెడుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
– ఈ రోజు అనంతపురం జిల్లాలో అడుగుపెట్టి గుంతకల్‌ నియోజకవర్గం నుంచి నడుచుకుంటూ గుత్తికి వచ్చాను. దారిపొడువునా నా వద్దకు ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
– ఇవాళ నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశాం. ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు తన కార్యకర్త సమావేశంలో మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనను మీరందరు చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మనమంతా కూడా మన మనసాక్షిని అడగాలి. మనకు ఎలాంటి నాయకుడు కావాలి.
– మనకు మోసం చేసే వాడు నాయకుడు కావాలా అని అడుగుతున్నాను. మనకు అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా?
– నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాం. ఆయనగారి పాలనలో అబద్ధాలు, మోసాలు కంటికి కనిపించే విధంగా ఉన్నాయి. బాబు పాలన ఎంత గొప్పగా ఉందంటే..గుత్తిలో మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ నా వద్దకు వచ్చారు. మండలానికి దాదాపు రూ.5కోట్లు ఖర్చు చేసి మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు చేశారు. ఈ స్కూళ్లలో ఉత్తీర్ణత వంద శాతం ఉంటుంది. అలాంటి మోడల్‌ స్కూల్‌లో పరిస్థితి ఏంటో తెలుసా..దాదాపుగా ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. వారికి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారు. వారి పిల్లల పరిస్థితి ఏంటి.
– మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు కూడా నా వద్దకు వచ్చారు. అన్నా..మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. 
– ఇదే గుత్తిలోని ఉర్దూ స్కూల్‌లో పిల్లలకు అన్నం వడ్డించే నిర్వాహకులు నా వద్దకు వచ్చారు. ఆరు నెలల నుంచి బిల్లులు రావడం లేదన్నా అని చెబుతున్నారు. పిల్లలకు అన్నం పెట్టేందుకు మా కమ్మలు అమ్మేశామని చెప్పడం బాధనిపించింది.
– మహానేత పాలనలో 20 నిమిషాల్లో కుయ్‌ కుయ్‌ అంటూ వచ్చే 108 వాహనం ఇప్పుడు రావడం లేదు. వారికి జీతాలు ఇవ్వడం లేదు
–జెడ్పీ హైస్కూల్‌లో మరుగుదొడ్లు లేవట. మంచినీరు లేదు.
– మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పాలన అన్యాయమైన స్థితిలో ఉంది. విచ్చలవిడి అవినీతి కనిపిస్తోంది. 
– ఇదే చంద్రబాబు ప్రభుత్వం మట్టి నుంచి ఇసుక దాకా, మద్యం నుంచి కాంట్రాక్టర్ల దాకా, రాజధాని భూములు, గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇవాళ దొంగల రాజ్యం సాగుతోంది. చంద్రబాబు పైన తింటూ ఇవాళ గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీల పేరుతో ఒక మాఫియాను తయారు చేశారు. పింఛన్లు కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
– నాలుగేళ్ల క్రితం ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏమన్నారో జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి పేదవాడికి మూడుసెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. నాలుగేళ్లు కావోస్తుంది. ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? 
– నాలుగేళ్ల క్రితం కరెంటు బిల్లు రూ.50, 60 వచ్చేది. ఎన్నిMýల ముందు కరెంటు  బిల్లులు తగ్గిస్తామన్నారు. ఇవాళ అదే బిల్లులు రూ.500, 1000 చొప్పున వస్తోంది. 
– గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, కందిపప్పు, కిరోసిన్, ^è క్కెర, చింతపండు వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు. చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప వేరేవి ఏమీ ఇవ్వడం లేదు.
– ఎన్నికల ముందు చంద్రబాబు మున్సిపల్‌ ట్యాక్స్‌ ఎక్కువగా అయ్యాయని చెప్పారు. గతంలో మున్సిపల్‌ ట్యాక్స్‌ రూ.50, 60 వచ్చేది. ఇవాళ మున్సిపల్‌ ట్యాక్స్‌ రూ.400 ఇంటికి, షాపుకు రూ.2 వేలు వేస్తున్నారు. 
– జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు ఎన్నికల ముందు ఊదరగొట్టారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండు వేళ్లు చూపించి రూ.2 వేలు ఇస్తామన్నారు. ఇవాల్టికి చంద్రబాబు ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డాడు.
–  బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. వ్యవసాయరుణాలు బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత బ్యాంకుల్లో రుణాలు మీ ఇంటికి వచ్చింది. బంగారం ఇంటికి రాలేదు. బంగారం వేలం వేస్తామని ఇంటికి నోటీసులు వస్తున్నాయి. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోవడం లేదు.
– పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? మాఫీ కథ దేవుడేరుగు, అక్కచెల్లెమ్మలకు ఇవాళ సున్నా వడ్డీ రుణాలు ఎగిరిపోయాయి. ముక్కుపిండి రూ.3 వడ్డీ వసూలు చేస్తున్నారు. వడ్డీ లెక్కలు ప్రభుత్వం నుంచి డబ్బులు బ్యాంకులు ముడితే వడ్డీ లేని రుణాలు వస్తాయి.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఏ కులాన్ని వదిలిపెట్టలేదు. ఈయన చేసిన మోసం ఇంతా అంతా కాదు. ఈ మోసం కొనసాగుతూనే ఉంది. మొన్ననే అసెంబ్లీలో చూశాం. బోయలను ఎస్టీలుగా చేస్తూ కేంద్రానికి బిల్లు పంపించారట. ఆ వెంటనే కేక్‌లు కోశారు. ఇలాంటి తీర్మానాలు ఎన్నిసార్లు చేస్తారని అడుగుతున్నాను.
– ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పావు. బోయలు, కురువలను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీలుగా చేర్చుతామన్నారు. ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రానికి పంపించామంటున్నావు. నీలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? సిగ్గులేకుండా నీ మోసాన్ని కంటిన్యూ చేస్తున్నావు. సిగ్గులేకుండా కేకులు కోస్తున్నావు.
– కాపుల విషయంలో కూడా ఇలాగే మాట్లాడావు. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రయత్నం చేస్తానని మోసం చేస్తున్నారు. 
– మనకు ఇలాంటి నాయకుడు కావాలా అని అడుగుతున్నాను. మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి మనకు అవసరమా? ఈ సారి ఎన్నికల్లో పెద్ద పెద్దవి చెబుతారు. ప్రతి ఇంటికి ఒక కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికి ఒక మారుతి కారు కొనిస్తానని చెబుతారు. వీటితో పని జరుగదంటే ఇదే పెద్ద మనిషి ఇంకా ఏమైనా చెబుతారు.
– చెడిపోయిన రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావాలి. రాజకీయ నాయకుడు తాను చేసిన వాగ్ధానం నెరవేర్చలేకపోతే ఆ నాయకుడు ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరగాలంటే మనమంతా ఒక్కటై చైతన్యవంతులం కావాలి. నాలుగు అడుగులు ముందుకు వేయాలి.
– గుంతకల్‌ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. వంద పడకల ఏరియా ఆసుపత్రి ఉంది. ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంకు కూడా లేని పరిస్థితి నెలకొంది. నర్సులను చంద్రబాబు తొలగిస్తారని భయంతో ఉన్నారు. 
– గుంతకల్‌లో కాన్పుల ఆసుపత్రి పూర్తిగా మూసివేశారు. గుత్తిలో ఎన్నిరోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ఐదు రోజులకు, పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ఇది చంద్రబాబు పాలన
– హంద్రీనీవాను తీసుకొచ్చానని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యమనిపిస్తుంది. గతంలో ఆయన రెండుసార్లు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలు చేయడం హంద్రీనీవాను మరిచిపోవడం పరిపాటిగా మారింది. చంద్రబాబు మరిచిపోతే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 80 శాతం పూర్తి చేశారు. మిగిలిపోయిన ఈ 20 శాతం పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయడం లేదు.
– హంద్రీనీవా ప్రాజెక్టు మొదటి దశ పూర్తి అయ్యింది. పిల్ల కాల్వలు తవ్వితే లక్ష ఎనబై వేల ఎకరాలకు నీరివచ్చు. ఈ ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇది చంద్రబాబుకు మన జిల్లాపై ఉన్న ప్రేమ.
– ఇక్కడే ఉన్న స్పిన్నింగ్‌ మిల్లు మూతపడింది. ఇక్కడ ఉద్యోగాలు లేవు. ప్రత్యేక హోదా తోనే ఉద్యోగాలు వస్తాయి. ఎన్నికల ముందు చంద్రబాబు 15 ఏళ్లు ప్రత్యేక హోదాను తీసుకువస్తానని చెప్పారు. తీరా తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు.
– రైతున్నలకు భరోసా కల్పించేందుకు, అక్కచెల్లెమ్మలు వడ్డీలు కడుతున్నారు వారికి తోడుగా నిలిచేందుకు, చదువుకుంటున్న పిల్లల కోసం, ఉద్యోగాల కోసం వెతుక్కునే యువత కోసం పాదయాత్ర చేపట్టాను.
– నవరత్నాలను ఇది వరకే ప్రకటించాను. వీటిని ఇంకా మెరుగ్గు అమలు చేసేందుకు మీరే సలహాలు ఇవ్వండి.  బీసీల మీద ఎక్కువ ప్రేమ అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. బీసీలకు నాలుగు కత్తెర్లు ఇస్తే ప్రేమ సరిపోతుందా. బీసీలకు మహానేత నిజమైన ప్రేమ చూపించారు. బీసీల్లో పుట్టిన వాళ్లను చదివించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేద వాడికి కూడా ఇంజనీరు, డాక్టర్‌ చదివేందుకు తోడుగా ఉన్నారు.
– నాన్నగారి స్ఫూర్తిగా తీసుకొని మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ పిల్లలను నేను చదివిస్తాను. లక్షల్లో ఫీజులు ఉన్నా నేను కడుతాను. వారు బయట ప్రాంతాలకు వెళ్లి హాస్టల్‌ ఉండేందుకు అయ్యే ఖర్చులు నేనే భరిస్తాను. ప్రతి ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని చెబుతున్నాను.
– ప్రేమంటే ఎలా ఉంటుంది అన్నది చూపించడానికి ఒక్క అడుగు నాన్న ముందుకు వేస్తే..నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. చిన్న చిన్న పునాదుల కోసం చెబుతున్నాను. మీ చిన్న పిల్లలను బడులకు పంపించండి. ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఆ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేందుకే ఆ డబ్బులు ఇస్తున్నాం.
– నవరత్నాల్లో రెండో గొప్ప కార్యక్రమం ఏంటో తెలుసా..మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ రూ. 2 వేలు చేస్తామని మాట ఇస్తున్నాను. పనులకు వెళ్తే కాని పేదల కడుపు నిండటం లేదు. వీళ్లందరికి నేను చెబుతున్నాను. పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాను. దీని వల్ల ప్రతి పేదవాడికి తినడానికి, మందులకు మేలు జరుగుతోంది.
– నవరత్నాల్లో మరోకటి చెబుతున్నాను. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని మీ అందరికి చెబుతున్నాను.
– ఇవన్నీ కూడా ఏ జన్మభూమి కమిటీ సభ్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. పింఛన్, ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డు, ఇల్లు కావాలన్నా..మీరు ఎవరికి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయిస్తాం. 72 గంటల్లోనే ఇవన్నీ కూడా మీకు ఇప్పించే కార్యక్రమం చేపడుతున్నాం.
– నేను చెప్పిన ప్రతి దానికి మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. మన మేనిఫెస్టో కేవలం రెండు, మూడు పేజీల మేనిఫెస్టో ఉంటుంది. అందులోని ప్రతి అంశం మీ నోటి నుంచి వచ్చిన మాటే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇవన్నీ చేసి చూపిస్తాం. చెప్పినవే కాదు..చెప్పవని కూడా చేసి చూపిస్తామని చెబుతున్నాను. మీ బిడ్డను ఆశీర్వదించండి, తోడుగా నిలవండి, పాదయాత్రలో మీ ఆలోచనలు, సూచనలు ఇవ్వమని పేరు పేరున కోరుతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను.


 

తాజా వీడియోలు

Back to Top