వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి

ప్ర‌కాశం: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందారన్న వార్త పట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు,  ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ధార్మికత, ఆధ్యాత్మిక చింతన, అత్యున్నత మానవతా విలువలను జీవితమంతా ఆచరించి ప్రబోధించిన జయేంద్ర సరస్వతి స్వామి  జగద్గురువుగా ఖ్యాతిపొందారని వైయ‌స్ జగన్‌ అన్నారు. ఆదిశంకరుల వారసునిగా దాదాపు రెండున్నర దశాబ్దాలు జయేంద్ర సరస్వతి స్వామి కంచిపీఠానికి అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని ఆయ‌న త‌న‌ తన సందేశంలో పేర్కొన్నారు.  
Back to Top