విజయనగరం: పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 275వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం విజయనగరం నియోజకవర్గంలోని జొన్నవలస క్రాస్ నుంచి ప్రారంభించారు. మయూరి జంక్షన్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు వైయస్ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. చాలీ చాలని వేతనాలతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మరో ఆరు నెలలు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్సించారు.
వినతుల వెల్లువ
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు. విజయనగరం పట్టణంలో వైయస్ జగన్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు. మహిళలు వారి సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లు, రేషన్ అందడం లేదని వాపోయారు. చిన్నారులను బడికి పంపితే చదివించే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి ఓటేశామని నిరుద్యోగుల తల్లిందండ్రులు వైయస్ జగన్ ఎదుట వాపోయారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని తమ గోడు వెళ్లోబోసుకున్నారు. తమ కోసం వైయస్ జగన్ ప్రజా సంకలప్ప యాత్ర చేయడం సంతోషంగా ఉందని విజయనగరం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.