ఎంపీల త్యాగం గర్వ కారణం


అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామాలు చేయడం గర్వకారణ మని, వారి త్యాగం వృథాపోదని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది’ అని వైయ‌స్ జగన్‌ తన ట్వీట్‌లో ఎంపీలను అభినందించారు.  


 

Back to Top