చెప్పిన ప్రతీ పని చేస్తా

– చంద్రబాబు ప్రతి అడుగులో మోసమే..
– ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా?
– ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
– నంద్యాల ఉప ఎన్నికల్లో మెడికల్‌ సీట్లు ఇస్తామని మోసం
– గుంటూరు మీటింగ్‌లో ప్లకార్డులు ప్రదర్శించిన యువకులపై కేసులా?
– హామీలు అమలు చేయనప్పుడు మేనిఫెస్టో ఎందుకు
– బాబు కేబినెట్‌లో ఒక్క ముస్లింకు కూడా చోటివ్వలేదు
– జగన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని టీడీపీ ప్రచారం 
– పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చిన ఘతన వైయస్‌ఆర్‌ది
– అధికారంలోకి రాగానే ఇంటింటా నవరత్నాలు
–ప్రతి అక్కకు వైయస్‌ఆర్‌ చేయూత పథకం కింద రూ.75 వేలు ఇస్తాం
– కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం
– వైయస్‌ఆర్‌ దుల్హాన్‌ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తాం
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తాం
– ప్రతి గ్రామంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తాం
– వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో కేవలం రెండు పేజీల్లో మాత్రమే ఉంటుంది


విశాఖ: చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, అలాంటప్పుడు మేనిఫెస్టో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో కేవలం రెండు పేజీలు మాత్రమే ఉంటుందని, చెప్పిన ప్రతీ పని చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ చంద్రబాబు పాలనను ఎండగడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేశారు. అలాగే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పాఉ. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

బాబు పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూసిన తరువాత..మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయన్న తరుణంలో విశాఖ నగరంలో ఇవాళ ఇక్కడ ముస్లింల మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో మనమంతా సంతోషంగా ఉన్నామా? మనకు మంచి జరిగిందా? లేదా అన్నది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. అభివృద్ధి అంటే చంద్రబాబు డిక్షనరీలో ఏంటో తెలియదు కానీ, నాకు, మీకు తెలిసిన అభివృద్ధి ఏంటంటే..నిన్నటి కంటే ఇవాళ బాగుంటే దాన్ని అభివృద్ధి అంటాం. చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూసిన తరువాత ఒక్కసారి నాన్నగారి పరిపాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను. మళ్లీ చంద్రబాబు పాలన కూడా ఒక్కసారి ఆలోచించండి. మనకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా ఆలోచించండి.

టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుంది?
ఎన్నికలకు వెళ్లేముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టో ప్రకటిస్తారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఫ్రెస్‌గా ఫొటో దిగి అందులో ప్రచురించారు. టీడీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తే..అసలు ఆ ప్రణాళిక ఇవ్వడం ఎందుకని చంద్రబాబును అడుగుతున్నాను. ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించారు. ప్రతి కులానికి అది చేస్తాను. ఇది చేస్తానని చెప్పారు. ఈ రోజు టీడీపీ 2014 మేనిఫెస్టో టీడీపీ వెబ్‌సైట్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఇది కనిపిస్తే చంద్రబాబును ప్రజలు కొడతారని తీసేశారు. 
– టీడీపీ మేనిఫెస్టోలో ముస్లింలకు రెండు పేజీలు కేటాయించారు. ఆయన కేటాయించిన దాంట్లో ప్రధానాంశాలు మీకు చెబుతాను. చంద్రబాబు చేశారా? లేదా అన్నది మీరంతకు మీరే మీ మనసాక్షిని అడగండి. ప్రతి ముస్లిం పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదువులు అన్నారు. జరిగిందా?

ఇస్లామిక్‌ బ్యాంకు ఏదీ?
ప్రతి ముస్లిం సోదరుడికి ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇస్లాం బ్యాంకు లేదు. వడ్డీ లేని రుణాలు లేవు. 
– ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలు చూస్తే..జస్టీస్‌ రంగనాధన్‌ కమిషన్‌ సిపార్సులకు అనుకూలంగా ముస్లింలకు సీట్లు కేటాయిస్తామన్నారు. ఏది కూడా అమలు కాలేదు.
– నిరుద్యోగ ముస్లిం యువకులకు వడ్డీలేకుండా రూ.5 లక్షల రుణం ఇస్తామన్నారు. మోసం. ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు.

ఎవరూ అడక్కపోయినా కూడా?
– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాం గురించి ఒక్కసారి ఆలోచించండి. దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, ఎవరు అడగకపోయినా కూడా ప్రతి ముస్లిం కుటుంబానికి మంచి జరగాలని వైయస్‌ఆర్‌ ఆ రోజుల్లో ఆరాటపడి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత నాన్నగారిది. ఆ రోజుల్లో ముస్లింలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక్కడైనా డాక్టర్, ఇంజినీర్, పెద్ద పెద్ద చదువులు చదివితే అప్పుడు ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని నాన్నగారు చెప్పేవారు. గతంలో ఎవరు చేయని విధంగా, ఎక్కడ జరగని విధంగా వైయస్‌ఆర్‌ చదవుల విప్లవాన్ని తెచ్చారు. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..నేను చదివిస్తానని ఆ రోజు భరోసా కల్పించారు. అది మరిచిపోలేం. నాన్నగారి హాయంలో మైనారిటీల కోసం 12 రెసిడెన్సియల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ ఏర్పాటు చేశారు.
– అప్పులపాలు కాకుండా ఉండేందుకు,  పేదవారికి జబ్బు చేస్తే ఆసుపత్రి కోసం అప్పులు చేయకూడని నాన్నగారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడ జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా 108 అంబులెన్స్‌ ఏర్పాటు చేయించారు. 108కు నంబర్‌ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చి ఆ పేదవారిని ఆసుపత్రికి చేర్పించి వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి చేర్చేవారు.
 – ఆ రోజుల్లో మైనారిటీల సంక్షేమం కోసం మైనారిటీ కార్పొరేషన్‌ నుంచి రూ.170 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘతన వైయస్‌ రాజశేఖరరెడ్డి గారిది. పేదవారికి ఆ రోజుల్లో ఇల్లు అన్నది ఒక స్వప్నం. అలాంటి పరిస్థితి వైయస్‌ఆర్‌ కల్పించారు. దేశంతో పోటీ పడి మన రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లులు కట్టించారు. 

 చంద్రబాబు చేసిందేంటి?
చంద్రబాబు హయాంలో ముస్లింలంటే మనుషులుగా చూడలేదు. టీడీపీ హయాంలో , చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమే. 2014–2015లో బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించామన్నారు. వాస్తవంగా ఖర్చు చేసింది రూ.380 కోట్లు మాత్రమే వినియోగించారు. 2015–2016లో రూ.460 కోట్లు కేటాయింపులు, 2017–2018లో కేవలం రూ.231 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎక్కడా కూడా న్యాయం జరుగదు. ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తోంది.
– మొన్న నంద్యాల ఉప ఎన్నికలను చిన్న ఉదాహరణ తీసుకుంటే..నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు కొన్ని జిమ్మిక్కులు చేయించారు. కడపలోని ఫాతిమా కాలేజీలోని కొంత మంది మైనారిటీ పిల్లలకు సీట్లు వచ్చాయి. వారికి పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్‌టీఆర్‌ యూనివర్సిటî   అఫ్రూవ్‌ చేసింది. ఏడాది పాటు మెడికల్‌ కాలేజీలో చదివారు. ఆ కాలేజీకి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రద్దు చేసింది. ఆ పిల్లలు రోడ్డున పడ్డారు. వారందరికీ మెరిట్లో సీట్లు వచ్చాయి. అలాంటి పిల్లలకు మదీనా కాలేజీలో సీట్లు అలాట్‌మెంట్‌ ఇచ్చారు. దాంట్లో ప్రభుత్వం తప్పు ఎలా కాకుండా పోతుంది. చంద్రబాబుకు మానవత్వం లేదు. ఆ పిల్లలు పూర్తిగా ఇబ్బందులు పడుతుంటే..వారిని నంద్యాల ఉప ఎన్నికలకు తీసుకొచ్చి స్టేజీ మీద ఏం చెప్పారో తెలుసా? ఆ పిల్లలకు ఫాతిమా మెడికల్‌ కాలేజీలో సీట్లు ఇప్పించానని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఆ పిల్లలకు సీట్లు రాలేదు. ఆ పిల్లలు విజయవాడకు వెళ్లి వాటర్‌ ట్యాంకు ఎక్కారు. పోలీసులతో పిల్లలను పిలిపించి చంద్రబాబు వారికి క్లాస్‌ ఇచ్చారు. మళ్లీ ఎంట్రన్స్‌ రాయండి, ఫీజులు నేనే కడుతానని చెప్పారు. మళ్లీ పరీక్షలు రాస్తే మెరిట్‌ రాలేదు. చంద్రబాబు ఫీజులు కడతామన్నారు. ఇప్పుడు అడిగితే అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. ఆ పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. 
– గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో మైనారిటీ బాలికపై అత్యాచారం జరిగింది. ఎన్నికల సమయంలో టీవీల్లో యాడ్స్‌ చూస్తే ఆయనొస్తారు..చంద్రబాబు క్యాంపు ఆఫీస్‌ పక్కనే ఇటువంటి పరిస్థితి జరిగినా పట్టించుకునే నాథుడు లేడు. అత్యాచారం చేసిన ఘటన జరుగకుండా చూడాల్సింది పోయి, ఆ వ్యక్తికి వైయస్‌ఆర్‌సీపీతో ముడిపెట్టే కార్యక్రమం చేశారు. ఆ చేసిన వ్యక్తి టీడీపీలో క్రియాశీలక వ్యక్తి. ఊర్లో అంతా గొడవ జరిగితే చివరికి ఆ వ్యక్తి బయపడి ఆత్మహత్య చేసుకుంటే..చివరికి తామే ఆత్మహత్య చేసుకునేలా చేశామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా?
– గుంటూరులోనే ఓ ముస్లిం అమ్మాయిపై అసభ్యంగా ప్రవర్తిస్తే..చర్యలు తీసుకోకుండా ఆందోళన చేసిన వైయస్‌ఆర్‌సీపీ, ఇతరులపై కేసులు పెట్టించారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి అప్పుడు నారా హమారా..టీడీపీ హమారా అని పెద్ద మీటింగ్‌ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. ముస్లింలు కొంత మంది అక్కడికి వెళ్లి అయ్యా..నీవు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని శాంతియుతంగా ప్లకార్డ్సులు చూపించారు. మదర్సా విద్యార్థులకు ఉచిత యూనిఫాం ఎక్కడా? ఉర్దూ యూనివర్సిటీలు ఎక్కడా? టీడీపీలో ముస్లింలకు ప్రాధాన్యత లేదని ఆ యువకులు ప్రశ్నించారు. దేశంలో ముస్లింలు లేని కేబినెట్‌ ఎప్పుడు లేదు. ఆదిత్యనా«ద్‌ ప్రభుత్వంలో కూడా మైనారిటీలు మంత్రులుగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ముస్లింలు, ఎస్టీలు కూడా మంత్రులుగా లేరు. టీడీపీ ముస్లిం నాయకత్వాన్ని ఎందుకు ప్రోత్సహించడం లేదని ప్రశ్నిస్తే..ఆ పిల్లను మూడు పోలీసు స్టేషన్లు మార్చి, దారుణంగా కొట్టారు. వారు చేసిన తప్పేంటి? గొడ్డును బాదినట్లు వారిని కొట్టే అధికారం ఎవరిచ్చారు. ఆ కేసులు చూస్తే..వాళ్లు దేశాన్ని విడగొట్టమని అడుగుతున్నట్లు కేసులు పెట్టారు. ఆ పిల్లల్లో ఒకరు ఆర్మీకి సెలెక్ట్‌ అయ్యాడు. అలాంటి పిల్లల మీద కేసులు పెట్టారు. 

ఈ మనిషి ముఖ్యమంత్రిగా అర్హుడా?
– రాజకీయాల్లో ఫలాని వ్యక్తి మా నాయకుడు అని సగర్వంగా కాలర్‌ ఎగురేసుకొని తిరగాలి. నేను రాజకీయం చేస్తున్నాను. చంద్రబాబు చేస్తున్న రాజకీయం చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. నా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. వారితో రాజీనామా చేయించలేదు. అదే టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి తన పార్టీలోకి వస్తే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాను. కేవలం 90 రోజులు ఎమ్మెల్సీ పదవి అనుభవించారు. ఇంకా 5 సంవత్సరాల 3 నెలల పదవిని త్యాగం చేసి రాజీనామా చేశారు. రాజకీయాలు అంటే  ఇవీ..
– నరేంద్రమోడీ గాలి వీస్తున్నప్పుడు బీజేపీ మంచిదని ఆ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మళ్లీ విడిపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మత తప్పిదం  అని ఎన్నికల తరువాత అన్నారు. మళ్లీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేశారు. చిలుకా గోరింకల మాదిరిగా ఒకరికొకరు పొగుడుకోవడం చూశాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మనకు చేసిన మేలు ఏ రాష్ట్రానికి చేయలేదని 2017 జనవరిలో చంద్రబాబు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఎన్నికలు దగ్గరకు రావడంతో నరేంద్ర మోడీ గాలి తగ్గిపోతుందని ఈ వ్యతిరేకత అంతా ఎవరో ఒకరిమీద వేసేందుకు మళ్లీ అదే మోడీ కనిపించారు. మోడీని 2014లో పైకి ఎత్తి పొగిడిన వ్యక్తి..2018లో అదే మోడీని విమర్శించడం మొదలుపెట్టారు.  ఎన్నికల సమయంలో జగన్‌కు ఓటు వేస్తే రాహుల్‌గాంధీకి వేసినట్లే అని బీజేపీతో జత కట్టారు. ఇప్పుడు జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అంటూ కాంగ్రెస్‌తో జట్టు కడుతారు. ఇటువంటి అన్యాయమైన పాలన రావాలి. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి పేదవారి ముఖంలో చిరునవ్వులు చూడాలని, ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. ప్రతి పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి మీటింగ్‌లో నవరత్నాలు చెబుతున్నాను. మన వెబ్‌సైట్‌లో నవరత్నాలు కరపత్రం ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. మన మేనిఫెస్టో కేవలం రెండు పేజీల్లో మాత్రమే ఉంటుంది. చెప్పిన ప్రతి పని చేస్తానని ఖచ్చితంగా హామీ  ఇస్తున్నాను. 
– ముస్లిం మైనారిటీలకు సంబంధించి అక్కచెల్లెమ్మలకు సంబంధించిన ఒక్క పథకం మాత్రమే చెబుతున్నాను. వైయస్‌ఆర్‌ చేయూత పథకం మహిళల కోసమే ప్రవేశపెడతాం. ఎస్సీలు, బీసీలు, ఎస్టీ మహిళలు ఒక వారం రోజులు పనులకు వెళ్లడంమానేస్తే పస్తులు ఉంటున్నారు. వారందరికీ పింఛన్‌ 45 ఏళ్లకే ఇస్తామంటే వెటకారం చేశారు. అందులో కూడా వెటకారం కూడా రాకూడదని వైయస్‌ఆర్‌ చేయూత అనే కార్యక్రమాన్ని ప్రవేశపెడుతాం.  ఇవాళ కార్పొరేషన్‌ గురించి చూస్తున్నాం. అందులో నుంచి కాస్తోకూస్తో డబ్బులు వస్తాయని కార్పొరేషన్‌ కావాలని అడుతాం. కార్పొరేషన్‌ పనితీరు ఎలా ఉందంటే ఊర్లో 100 మంది ఉంటే ఐదు మందికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. 30 శాతం ప్రభుత్వ సబ్సిడీ కోసం లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. ఇది పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. కార్పొరేషన్‌ ప్రక్రియ ఎలా ఉండాలని భావి తరాలకు మనం నేర్పిస్తాం. ప్రతి కులానికి, ప్రతి అక్కకు ఒక ప్రయోగంగా మార్చుతాం. ఏ కుటుంబానికి రుణం రాలేదన్న మాట లేకుండా చేస్తాం. 45 ఏళ్ల వయసు ఉన్న అక్కలకు ఎక్కడైనా ఉన్నా..కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం. మొట్టమొదట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రతి ఒక్కరికి రూ.75 వేలు ఇప్పిస్తాం. నాలుగు ధపాలుగా అందజేస్తాం, ప్రతి ఏటా డబ్బు ఇచ్చి అక్కను నడిపిస్తాం. కార్పొరేషన్‌ మీకు సలహాలు ఇస్తుంది. ప్రతి ఏడాది క్రమంతప్పకుండా కార్పొరేషన్‌ నుంచి డబ్బులు వచే ్చలా చూస్తాం. ప్రతి అక్కకు రూ.75 వేలు పారదర్శకంగా ఇప్పిస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తాం. మీ ఊర్లోనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. మీకు ఎలాంటి సంక్షేమ పథకం అందాలన్నా 72 గంటల్లోగా అందజేస్తాం. వైయస్‌ఆర్‌ దుల్హాన్‌ పథకం కింద లక్ష రూపాయలు అందేలా చూస్తామని హామీ ఇస్తున్నాను. పిల్లనలు బడికి పంపిస్తే తల్లి ఖాతలో రూ.15 వేలు ప్రతి ఏడాది అందజేస్తాం. ఇందులో ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాను. ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించాలని పేరు పేరునా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top