రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రానివ్వం


– చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
– మనకు ఎలాంటి పాలన కావాలో ఆలోచించండి
– చంద్రబాబు పాలనలో ఫోన్‌ కొడితే మందు బాటిల్‌ ఇంటికి వస్తోంది
– బెల్టు షాపులు ప్రతి గ్రామంలో ఉన్నాయి
– నాలుగేళ్ల పాలనలో 3 సార్లు కరెంటు చార్జీలు పెంచారు
– నిన్నటి కంటే ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామా?
– రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు
– మనందరి ప్రభుత్వం రాగానే రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌
– రైతన్నలకు ప్రతి మే నెలలో పెట్టుబడి కింద రూ.12,500 ఇస్తాం
– రైతులకు పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తాం
– పంటలకు గిట్టుబాటు ధర ముందే నిర్ణయిస్తాం
– రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తాం
– యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టులు పూర్తి చేయించి నీరందిస్తాం.


ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు తోడుగా ఉంటామని, ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రానివ్వనని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ  ఇచ్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు ప్రకటించామని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 105వ రోజు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ౖÐð యస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఇవాళ ఎండ ఎక్కువగానే ఉన్నా నాతో పాటు వేలాది మంది అడుగులో అడుగులు వేశారు.  ఏ ఒక్కరూ ఎండను ఖాతరు చేయకుండా, నడిరోడ్డు అన్న సంగతి మరిచి నాపై ప్రేమానురాగాలు చూపుతున్నారు. మీ అందరి అప్యాయతలకు, ఆత్మీయతలకు, ప్రేమానురాగాలకు  శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

– నాలుగేళ్లు చంద్రబాబు పాలన చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబు తన కార్యకర్తలకు ఊదరగొడుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి మనందరం గుండెలపై చేతులు వేసుకొని మనకు ఎలాంటి పాలన కావాలో ఆలోచించమని కోరుతున్నాను. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి అంటే ఏంటో ఆ లోచన చేయండి. మనందరికి తెలిసిన అభివృద్ధి ఏంటి అంటే..నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. నిన్నటి కంటే ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామా అని అడుగుతున్నాను. నాలుగేళ్ల ఈ పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి. 
– పెట్రోల్, డీజిల్‌ ధరలు ఏపీలో మండిపోతున్నాయి. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు బార్డర్‌లో పెట్రోల్‌ పోయించుకుంటే మన కన్న రూ.7 తక్కువగా ఉంది. నాలుగేళ్లుగా చంద్రబాబు పెట్రోల్, డీజిల్‌పై బాదుడే బాదుడు. దేశంలో ఎక్కడ లేని ధరలు ఇక్కడే ఉన్నాయి. 
– పిల్లలు తాగి చెడిపోతున్నారని నాలుగేళ్ల క్రితం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే మద్యాన్ని తగ్గిస్తానని, బెల్టు షాపులు రద్దు చేస్తానని చెప్పారు. ఇవాళ మన గ్రామాల్లో తాగడానికి మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ, ఏ గ్రామంలోనైనా బెల్టు షాపు లేకుండా ఉందా? ఫోన్‌ కొడితే ఇవాళ మందు బాటిల్‌ ఇంట్లో ఇచ్చి పోతున్నారు. 
– కరెంటు చార్జీలు షాక్‌ కొడుతున్నాయని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్ల క్రితం మీ అందరికి కరెంటు బిల్లు ఎంత వచ్చేది. గతంలో రూ.50, రూ.70, 100 రూపాయలు వచ్చేది. ఇవాళ రూ.500, 1000 రూపాయలు బిల్లు వస్తోంది. 
– రేషన్‌షాపుల్లో గతంలో బియ్యం, కందిపప్పు, చక్కెర వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు. అయితే ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇ వ్వడం లేదు. అది కూడా వేలి ముద్రలు పడటం లేదని కోతలు విధిస్తున్నారు.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధర వచ్చిందా? ఇవాళ శనగలు 60 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. మార్కెట్లో క్వింటాల్‌ రూ.3400 అడుగుతున్నారు. మిర్చి రూ.4 వేలకు కొనే పరిస్థితి లేదు. కందులు మార్కెట్‌కు వెళ్లి అమ్ముకుందామంటే రూ.3500లకు కొనే వారు లేరు. మద్దతు ధర రూ.5400 ఉంటే వైయస్‌ జగన్‌ తిడుతున్నారని ఈ ప్రభుత్వం మార్కెట్‌యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడేమో కేవలం రెండు బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కందుల్లో కూడా తేమ శాతం ఉందని అడుగుతున్నారంటే వీళ్లు కొనుగోలు చేయకూడదని ఏ స్థాయిలో నిర్ణయించుకున్నారో అర్థం చేసుకోండి.
– బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత మీ అందరిని అడుగుతున్నాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి. చంద్రబాబు చేసిన రుణమాఫీ పథకం చివరకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యేందుకు అక్క చెల్లెమ్మలను కూడా వదలకుండా మోసం చేశారు. ప్రతి ఇంటా ఇవాళ అక్కచెల్లెమ్మలు కన్నీరు పెడుతున్నారు. నాడు డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?, పైగా అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇంటిని వేలం వేస్తున్నారు.
– చివరకు పిల్లలను కూడా చంద్రబాబు వదలిపెట్టలేదు. పిల్లల జోలికి వెళ్లాంటే ఎవరైనా నాలుగు సార్లు ఆలోచిస్తాను. అయితే చంద్రబాబు వీరిని కూడా వదల్లేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నాలుగేళ్ల తరువాత మీ అందరిని అడుగుతున్నాను ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.96 వేలు బాకీ పడ్డాడా? లేదా? ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే రూ.96 వేల పరిస్థితి ఏంటి అని అడగండి.
– నాలుగేళ్ల పాలనలో మనం చూసింది అబద్ధాలు, మోసాలు, విచ్చలవిడిగా చట్టాలను ఉల్లంఘన చేయడం చూశాం. పైస్థాయి నుంచి కింది వరకు అవినీతి అన్నది గొప్పగా జరుగుతోంది. పైన చంద్రబాబు మట్టి నుంచి ఇసుక, మద్యం, బొగ్గు, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, గుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు. అవినీతి డబ్బుతో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారు. మాములుగా ఎవరైనా ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడితే ఆ ఉద్యోగిని సస్పెండ్‌ చేస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డగోలుగా దొరికిపోయినా ఆయన రాజీనామా చేయడు, అరెస్టు చేయరు. అడ్డగోలుగా చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. 22 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రూ.30 వేల చొప్పున కొనుగోలు చేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారు. నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాని వారిని రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకునే సత్తా చంద్రబాబుకు లేదు. ఏ ఒక్కరూ ఆయనకు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు కాబట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఉన్న అసమర్ధ ముఖ్యమంత్రిని చూస్తున్నాం.
– మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి ..మీ అందరికి మోసాలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా?అబద్ధాలు చెప్పేవారు సీఎం కావాలా?చెడిపోయిన ఈ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపరచాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వ స్తుంది.
– పొరపాటున ఈ చంద్రబాబును క్షమిస్తే..రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఇక మీకు చిన్న చిన్న అబద్ధాలు చెబితే నమ్మరని చంద్రబాబుకు తెలుసు కాబట్టి పెద్ద పెద్దవి చెబుతారు. ప్రతి ఒక్కరికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా అన్నా..నమ్ముతారా తల్లీ..నమ్మరని ఆయనకు తెలుసు కాబట్టి బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఒక్కరికి బెంజి కారు కొనిస్తా అంటారు. నమ్ముతారా? నమ్మరని ప్రతి ఒక్క ఇంటికి మనిషిని పంపించి రూ.3 వేలు డబ్బు కూడా పెడతారు. డబ్బులు ఇస్తే వద్దూ అనకండి. రూ.5 వేలు గుంజండి. అదంతా మన డబ్బే..కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను. మోసాలు చేసేవారిని, అబద్ధాలు చెప్పేవారిని బంగాళఖాతంలో కలపండి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం వస్తుంది.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ నవరత్నాలతో ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే ధ్యేయం. ఈ సభలో నవరత్నాల గురించి మనం ఏం చేయబోతున్నామన్నది ఈ సభలో చెబుతున్నాను. రైతుల గురించి చెబుతున్నాను. ఇందులో మీ సలహాలు ఇవ్వమని కోరుతున్నాను.
– మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు మనం ఏం చేస్తామంటే..అవస్థల్లో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు పెట్టుబడి  తగ్గిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక 9 గంటల పాటు పగటి పూట ఉచిత కరెంటు ఇస్తామని చెబుతున్నాను. ఇవాళ రైతులకు పంట రుణాలు అందడం లేదు. రైతు రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మోసం చేశారు. గత ప్రభుత్వాలు రైతులకు వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేవారు. చంద్రబాబు నాలుగేళ్లుగా వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం మానేశారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంట రుణాలపై వడ్డీ లేకుండా చూస్తాను. ప్రతి రైతుకు వడ్డీ భారం లేకుండా చేస్తాం. ప్రతి రైతు జూన్‌లో పంటలు వేస్తారు. దానికన్న ఒక నెల ముందు మే నెలలో ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తాం. ఎకరా ఉన్న రైతుకు పెట్టుబడికి వచ్చినట్లే. ఆ డబ్బు రైతుకు ఏదో విధంగా ఉపయోగపడుతోంది. బోర్లు వేసుకొని రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమం చేపడతాం. ఈ నాలుగు కార్యక్రమాల ద్వారా రైతులకు పెట్టుబడులు తగ్గిస్తాం.
– రైతులు కష్టపడి పంట పండిచిన తరువాత వాటిని అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక పంట వేసే ముందే రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. ఇందుకోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను. కోఆపరేటివ్‌ రంగాన్ని పునరుద్ధరిస్తాం. ప్రతి రైతును ఆదుకుంటానని హామీ ఇస్తున్నాను. అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపాదిన ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. రైతులకు కోసం మనం చేసే కార్యక్రమాల్లో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాను. ఎవరైనా అర్జీ తీసుకొని రావచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డుకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని మీ అందరిని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున  కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.

Back to Top