రైతులకు తోడుగా ఉంటా

 

– చంద్రబాబు పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారు.
– ఎన్నికల్లో గెలవడానికి బాబు చాలా అబద్ధాలు చెప్పారు.
– చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీలు మూత వేయించారు
– గతంలో ఈ ఫ్యాక్టరీలు మూత పడితే వైయస్‌ఆర్‌ తెరిపించారు.
– జీవోలతో చంద్రబాబు చెరకు రైతు కడుపు కొడుతున్నారు
– పాల రేట్లను తగ్గించి ఒక పద్ధతి ప్రకారం డయిరీలను మూత వేయించారు
 – మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతుకు ఏటా రూ.12,500
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
– రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి
– యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తా

చిత్తూరు: చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు చాలా అబద్దాలు ఆడారని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నెమ్మళగుంటపల్లి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

రెతుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో రైతులందరం ఒక్కచొట చేరాము. చంద్రబాబు నాలుగేళ్ల పాలనను చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తే బాగుంటుంది. ఎలా చేస్తే బాగుంటుందన్న విషయాలపై మీ అందరి సలహాలు తీసుకునేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశాం. ఆ సూచనలు, సలహాలతో మనందరి ప్రభుత్వంలో మంచి పాలన అందించాలన్నదే ఆరాటం.

సీఎం పదవి కోసం ఏమన్నారు..
ఇదే చంద్రబాబు ప్రభుత్వం గురించి మాట్లాడాల్సి వస్తే ..ఇదే పెద్ద మనిషి సీఎం పదవి కోసం ఏమన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలు అన్నీ కూడా బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను. బ్యాంకుల్లో బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల వారు మాత్రం మన బంగారాన్ని వేలం వేస్తూ నోటీసులు పంపిస్తున్నారు. తాను చేస్తున్న రుణమాఫీ చివరకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నాడు. ఈ రోజు మిమ్మల్నే అడుగుతున్నాను. మీ గుండెలపై చేతులు వేసుకొని ప్రశ్నించుకోండి. ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా?. ఏ మైంది ఆ ధరల స్థిరీకరణ నిధి. చంద్రబాబు పుణ్యానా కరువు కూడా ఆయనతోనే వచ్చింది. ఇద్దరూ కవల పిల్లలు కాబట్టి ఇబ్బందులు పడుతున్నాం. కరువు మండలాల క్రింద ఏమైనా ప్రకటిస్తే ప్రభుత్వం సాయం చేస్తుందని రైతులు భావిస్తారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణాలపై వడ్డీ మాఫీ అవుతుందని ఎదురు చూస్తాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ కానీ, కరువు సాయం కానీ ఏమైనా కనిపించిందా?. ఈ ఏడాది కూడా రాయలసీమలో జూన్‌లో పంటలు వేస్తాం. మైనస్‌ 22 శాతం వర్షపాతం ఉంది. కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉంది. రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని కరువు మండలాలుగా ప్రకటించడం లేదు. రైతులను సంతోషపెట్టే కార్యక్రమం ఏ ఒక్కటి కూడా జరుగలేదు. రైతులకు మేలు చేయాలనుకుంటే ఏ ప్రభుత్వమైనా కో–ఆపరేటివ్‌ రంగాన్ని ప్రోత్సహించాలి. చెరకు ఫ్యాక్టరీలు కో–ఆపరేటివ్‌ రంగంలో నడపాలి. అప్పుడే చెరకు రైతుకు లాభాలు వస్తాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఉన్న రెండు చెరకు ఫ్యాక్టరీలు మూత వేయించారు. గతంలో 9 ఏళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ రెండు ఫ్యాక్టరీలు మూత వేయించార. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ రెండు ఫ్యాక్టరీలు తెరిపించారు. పదేళ్ల పాటు రైతులు చల్లగా బతికారు. మళ్లి మన ఖర్మకొద్ది చంద్రబాబు సీఎం అయ్యారు. మళ్లీ ఆ రెండు ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. కానీ ఇదే జిల్లాలోని నాలుగు ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు లాభాల మీద లాభాల్లో నడుస్తున్నాయి. గిట్టుబాటు ధర రాక చెరకు అమ్ముకోలేక బెల్లం తయారి చేస్తే వాటి ఎగుమతులపై చంద్రబాబు ఆంక్షలు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చే ముందు ఓ మహిళ బెల్లం, పాలు, నీళ్లు తీసుకొని వచ్చింది. ఈ ప్రాంతంలో నల్లబెల్లం మాత్రమే పండుతుంది. మేం ఏంచేయాలన్నా అన్నారు. అన్నా..ఒక లీటర్‌ నీళ్లు రూ.20, మరో బాటిల్‌లో పాలు తీసుకొచ్చింది. పాలు కూడా లీటర్‌ రూ.20 అమ్ముతున్నామన్నా..ఎలా బతకాలన్నా అని అడిగారు. చంద్రబాబు తన హెరిటేజ్‌ ఫ్యాక్టరీకి లాభాల కోసం చిత్తూరు, విజయ డయిరీలను మూత వేయించారు. విజయ డయిరీలకు పాలు పోస్తే డబ్బులు రావు అన్నట్లు ఒక పద్ధతి ప్రకారం మూత వేయించారు. జిల్లాలో అన్ని కూడా ప్రైవేట్‌ ఫ్యాక్టరీలే ఏర్పాటు చేయించారు. రైతుల వద్ద నుంచి ఎంత తక్కువ ధరకు పాలు, ధాన్యం కొనుగోలు చేయాలని దిక్కుమాలు ఆలోచన చేస్తున్నారు. మన ఖర్మ కొద్ది ఆయన హెరిటేజ్‌లో కూరగాయాలు కూడా అమ్మడం మొదలుపెట్టారు. ఈయన ఒక దళాయి అయి రైతులను అమ్మేస్తున్నారు. రైతుల వద్ద ఉన్నప్పుడేమో రేటు తక్కువగా ఉంటుంది. ఈయన వద్దకు వెళ్లే సరికి రేటు పెరుగుతుంది. రైతుల గురించి ఇదే ముఖ్యమంత్రి ఆలోచించడం లేదు. కరెంటు కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఇస్తే ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సి వస్తుందని కనెక్షన్లు ఇవ్వడం లేదు. 

ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే..
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి.  హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చంద్రబాబు సీఎం కాకముందే రూ.600 కోట్లతో దాదాపు వైయస్‌ఆర్‌ పూర్తి చేయించారు. వీటికి కాల్వలు తవ్వించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. నాలుగేళ్లు అవుతుంది. ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు.  ఇటువంటి పరిస్థితుల్లో రేపొద్దున దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేయబోతున్నామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. రైతుల కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. వినండి..ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే నాకు సలహాలు ఇవ్వండి

మనందరి ప్రభుత్వం వచ్చాక..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను అన్ని విధాల ఆదుకుంటామని వైయస్‌ జగన్‌హామీ ఇచ్చారు. ఇందు కోసం నాలుగు పద్ధతుల్లో రైతులకు తోడుగా ఉంటానని చెప్పారు. 
1. రైతులు పంట వేసే పెట్టుబడి ఖర్చు తక్కువ అయితేనే రైతుకు మేలు జరుగుతుంది. మొట్టమొదటగా పెట్టుబడులు తగ్గిస్తామంటే..రైతుకు ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తాం. 
2. రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు ప్రతి ఏటా జూన్‌ మాసంలో పంటలు సాగు చేస్తారు. పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. అందుకోసమే ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడుల కోసం ఇస్తాం. ఒక్క ఎకరా ఉన్న రైతుకు ఈ డబ్బులు 90 శాతం వరకు ఉపయోగపడుతుంది. అంతకన్న ఎక్కువపొలం ఉన్న రైతుకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది.
3. చంద్రబాబు పుణ్యానా ఏ రైతుకు వడ్డీ లేని రుణాలు అందడం లేదు. కారణం చంద్రబాబు సీఎం అయ్యాక వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టడం లేదు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీలు లేకుండా చేస్తాం.  
4. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. రైతన్న పంట వేయకముందే ఏ రేటుకు కొనుగోలు చేస్తామో ముందే ప్రకటిస్తాం. వ్యాపారులు ఇంతకన్న ఎక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తాం. నల్లబెల్లంపై ఉన్న ఆంక్షలు పూర్తిగా ఎత్తేస్తాం.
– పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట అన్నది ఒక సామెత. ఇవాళ చంద్రబాబు సీఎం అయ్యాక నీళ్ల రేటు, పాల రేటు ఒక్కటే ఉన్నాయి. ప్రతిరైతుకు తోడుగా ఉండేందుకు చెబుతున్నాను. అధికారంలోకి వచ్చాక చిత్తూరు డైరీని తెరిపిస్తా. ప్రతి జిల్లాలో కో–ఆపరేటివ్‌ రంగంలోని ఫ్యాక్టరీలను ప్రోత్సహిస్తాం. ప్రతి లీటరుకు అదనంగా రూ.4 ఇస్తాం. ఈ రకంగా ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
– రైతులకు అనుకోకుండా కరువు వచ్చినా..ఉహించన రీతిలో అకాల వర్షాలు వస్తే రైతులకు తోడుగా ఉండేందుకు అక్షరాల రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం.  మా ముఖ్యమంత్రి మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా కల్పిస్తాం.
– కాల్వల నుంచి నీళ్లు ఇచ్చేందుకు యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తా. ఇవాళ ప్రతి ఇరిగేషన్‌ ప్రాజెక్టును లంచాల కోసం చేస్తున్నాడు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ నాలుగు కార్యక్రమాలు చేపడితే రైతులకు మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా ఏవైనా చేయాల్సి వస్తే నాకు సలహాలు, సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాను. 
 
Back to Top