ముస్లింలకు సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తాం


– ముస్లింలకు ఎంత చేసినా తక్కువే 
– మీ పిల్లలను డాక్టర్లు, ఇంజినీరింగ్‌ చేసే బాధ్యత నాది
– చిన్నారుల చదువులకే   కాదు.. 
    ఉండటానికీ తినడానికీ అయ్యే ఖర్చును కూడా నేనే భరిస్తాం. 
– వెయ్యి దాటిన ప్రతి పరీక్షను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. 
– దేశంలో ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఖర్చులు భరిస్తాం. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. 
ఏడాదిలో ఎన్నికలొస్తున్నాయని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో మనం కూడా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తిని గెలిపించాలని నిర్ణయించుకోవాలి.
 రాజకీయాలు అనే పదానికి.. రాజకీయనాయకునికి విశ్వసనీయత లేకుండా చేశారు. నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ఆర్‌ రుజువు చేస్తే.. ఎలా ఉండకూడదో చంద్రబాబు అలా ఉన్నాడు. 
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ఒక్కో కులానికి ఒక్కో పేజీ ఉంటుంది. ఎలా మోసం చేయాలో నేర్చుకోవాలంటే చంద్రబాబునే చూడాలి. 
ఎస్టీల్లో చేర్చమని మత్స్యకారులు అడిగితే తాట తీస్తాం.. ఖబడ్డార్‌ అని బెదిరించడం సబబేనా.. ఎన్నికలకు ముందిచ్చిన హామీ నెరవేర్చమని అడగడం తప్పా. 
– పేద ముస్లిం సోదరులకు రూ. 5లక్షల రుణం ఇస్తానన్నాడు
– వడ్డీలేని ఇస్లామిక్‌ బ్యాంకు పెడతానని అన్నాడు..
– ముస్లింలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని చెప్పాడు
రాబోయే ఎన్నికల్లో మనం ఏం చేయాలో మీరే చెప్పండి మీ సూచనలు పాటిస్తాం. 
మేనిఫెస్టో మీ సూచనల మేరకే ఉంటుంది. 

పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్లు చదువుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. దానికి ఏడాదికి లక్ష రూపాయలు అవుతుంది. కానీ చంద్రబాబు ఇచ్చే 30 వేలు.. సగం ఫీజుకే సరిపోవడం లేదు. 
– ముస్లింలమీద ప్రేమంటే పండగొచ్చినప్పుడు టోపీ పెట్టుకోవడం కాదు. 
– బీసీల మీద ప్రేమంటే ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు పంచడం కాదు. 
– మీ పిల్లలను ఏం చదివించాలనే నిర్ణయం మీది. దానికయ్యే రూపాయితో సహా ఖర్చంతా నేనే భరిస్తా. 
– ఫీజులతో పాటు వారు ఉండటానికి తినడానికి ఏడాదికి రూ. 20 వేలిస్తాం. 
– పేద విద్యార్థుల చదువుల కోసం వైయస్‌ఆర్‌ ఒకడుగు వేశారు.. మీరు గెలిపిస్తే ఆ మహానేత కొడుకుగా నేను మరో అడుగు ముందుకేసి మీ రుణం తీర్చుకుంటా. 
– ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులకే కాదు.. స్కూల్‌ నుంచి హైస్కూల్‌ దాకా పిల్లలకు ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. 
– ఏ కుటుంబమైనా అప్పులపాలయ్యేది రెండే సందర్భాల్లో..
ఒకటి పిల్లలను చదివించుకోలేక.. రెండోది అనారోగ్యంతో
– 50 రోజులకు పైగా పాదయాత్ర చేస్తుంటే రోజూ చాలా మంది వచ్చి కలుస్తున్నారు. ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని వాపోతున్నారు. 
– ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చంద్రబాబు ఆరోగ్యశ్రీ అమలు చేయడం లేదు. 
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే వెయ్యి దాటిన ప్రతి ఖర్చునూ ఆరోగ్యశ్రీ కిందికి తెస్తాం. 
– ఆపరేషన్‌ దేశంలో ఎక్కడ చేయించుకున్నా ఆరోగ్యశ్రీ అమలు చేసి తీరుతాం. 
– రోగి రెస్ట్‌ తీసుకుంటున్న సమయంలోనూ ఖర్చులు భరిస్తాం. 
– దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు అందజేస్తాం. ఏడాదికి పదివేలు అందిస్తాం. 
– పేదలకు నవరత్నాలను అందించడమే లక్ష్యం. 
– పింఛన్‌ రెండు వేలకు పెంచుతున్నాం. పింఛన్‌ లబ్ధిదారుల వయసు 45 ఏళ్లకే తగ్గిస్తాం. 
– చంద్రబాబు ఇమామ్‌లకు 5వేలు, మౌజమ్‌లకు 3వేలు ఇస్తారని చెప్పారు. అది కూడా 10 శాతం మసీదులకు కూడా ఇవ్వడం లేదు. 
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఇమామ్‌లకు 5 వేలను 10 వేలకు పెంచుతాం.. మౌజన్‌లకు 5 వేలిస్తాం. 
– ముస్లిం సోదరులకు ఎంత చేసినా తక్కువే. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తాం. 
– ప్రతి గామంలో స్థానికంగా ఉండే పది యువకులతో గ్రామ సెక్రటేరియట్‌లు ఏర్పాటు చేసి మీ సమస్యలు 72 గంటల్లో అమలు చేసి తీరుతాం. 
– ఏటా లక్షా 70 వేల పోస్టులు ఖాళీ అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ వేసి పోస్టులు భర్తీ చేసి తీరుతాం. 
Back to Top