అన్న చెప్పాడని అందరికీ ధైర్యంగా చెప్పండి-ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భ‌రోసా ఇస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌
- రైతు భ‌రోసా కింద ప్ర‌తి ఏటా రూ.12,500
- అంద‌రికీ ఇల్లు క‌ట్టిస్తాం
- మీ పిల్ల‌ల‌ను చ‌దివించే బాధ్య‌త నాదే
- ఏ ఆప‌రేష‌న్ అయినా ఉచితంగా చేయిస్తాం

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌తి ఒక్క‌రిలో ధైర్యం నింపుతూ..మంచి రోజులు వ‌స్తాయ‌ని జ‌న‌నేత భ‌రోసా క‌ల్పిస్తూ ముందుగు సాగుతున్నారు. న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వైయ‌స్ఆర్ జిల్లాలో పూర్తి చేసుకొని, క‌ర్నూలు జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా రాజ‌న్న బిడ్డ‌కు ప్ర‌తి గ్రామంలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దారిపొడువునా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటూ, మీరే దిక్కు అని మొర‌పెట్టుకుంటున్నారు. ఎక్క‌డికి వెళ్లినా చంద్ర‌బాబు మోసాలు వెలుగు చూస్తున్నాయి. అన్ని అర్హ‌త‌లు ఉన్నాపింఛన్లు, పక్కాగృహాలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు వర్తించడం లేదని మహిళలు వైయ‌స్‌ జగన్‌కు సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ వారికి ధైర్యం చెబుతూ..వైయ‌స్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్న చెప్పాడని అందరికీ ధైర్యంగా చెప్పండి’ అని వైయ‌స్‌ జగన్‌ సూచించారు. 


న‌వ‌ర‌త్నాల‌తో అన్ని వ‌ర్గాల‌కు ల‌బ్ధి 
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తామ‌న్నారు. గ్రామంలో ఏ ఒక్కరు కూడా మాకు ఇల్లు లేదని చెప్పేవారు లేకుండా అందరికీ ఇళ్లు కట్టిస్తాం. రైతులు నష్టపోకుండా పంట వేసే ముందు గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. పంట సాగుకు మే, జూన్ నెల‌లోనే ప్ర‌తి ఏటా రూ.12500 రైతు భ‌రోసా ప‌థ‌కం కింద అంద‌జేస్తామ‌న్నారు. పింఛన్‌ వయసును 45 ఏళ్లకు తగ్గించడంతో పాటు నగదును రూ.2 వేలకు పెంచుతాం. ఎన్నికల నాటికి ఉన్న డ్వాక్రా రుణ బకాయిలను నాలుగు విడతల్లో మహిళల చేతికే ఇస్తాం. బ్యాంకులకు వడ్డీ మొత్తాన్ని చెల్లించి అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలను అందిస్తాం. ఇద్దరు పిల్లలను చదివిస్తే ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లుల అకౌంట్లలో జమ చేస్తామ‌ని వైయ‌స్‌ జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు.  

పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..
తుగ్గలి సమీపంలో మహిళా రైతులు శ్రీదేవి, సిద్దమ్మ, లత్తమ్మ, తదితరులు తెగులు సోకిన పత్తిపంటను వైయ‌స్‌ జగన్‌కు చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ వారితో మాట్లాడుతూ మనం అధికారంలోకి వస్తే అన్నదాతలు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టమాటాలను లారీలో తీసుకెళుతున్న రైతులను ఆయన పలకరించారు. టమాటాల బుట్టను ఎంతకు విక్రయిస్తున్నారని అడగ్గా బుట్ట(25కిలోలు) రూ.150 నుంచి రూ.200 విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు. వాటిని హెరిటేజ్‌లో ఎంతకు కొనుగోలు చేస్తున్నారని వైయ‌స్‌ జగన్‌ అడగ్గా కిలో రూ.50 నుంచి రూ.60కి కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Back to Top