దివ్యాంగుల‌కు రూ.3 వేల పింఛ‌న్‌


- ఈ ప్ర‌భుత్వం ఎవ‌రికి పింఛ‌న్ ఇస్తుంది ఆగ్ర‌హం
- పిం- ఛన్‌ అందేలా కలెక్టర్‌కు లేఖ రాస్తా
కర్నూలు: మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల‌కు నెల‌కు రూ.3 వేల పింఛ‌న్ ఇస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు.  మానసిక వికలాంగులకు పెన్షన్‌ ఇవ్వకపోతే ప్రభుత్వం ఎవరికి ఇస్తుందని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రకు ఓ మానసిక వికలాంగ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చాడు. వైయస్‌ జగన్‌ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. తన కొడుకు నడవలేడు.. మాట్లాడలేడు.. అయినా ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పందించిన వైయస్‌ జగన్‌ పెన్షన్‌ అందే విధంగా కలెక్టర్‌కు లేఖ రాస్తానని, అయినా రాకపోతే దిగులుచెందవద్దని, త్వరలో మన ప్రభుత్వం వస్తుందని, వికలాంగులకు పెన్షన్‌ రూ.3 వేలు చేస్తామని, న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. 

అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదు
ఇంకో సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుంది. వికలాంగులకు పెన్షన్‌ రూ. 3వేలు చేస్తాం.. రెండు కాళ్లు కోల్పోయి పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటికీ అందలేదని వికలాంగుడు వైయస్‌ జగన్‌కు తన బాధను చెప్పుకున్నాడు. పత్తికొండలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు చేరుకొని వైయస్‌ జగన్‌ను కలిశారు. దరఖాస్తు చేసుకుని ఎన్ని సార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. 

Back to Top